ఉగాది పండుగ సందర్భంగా కవిత్వం
ఉదయసూర్యుడు నవ్వుతూ వెలిగే వేళ,
ప్రకృతి కొత్త వస్త్రాలు ధరించి మనసును హర్షింపజేస్తుంది.
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మేమంతా ఆనందిస్తాము.
ఉగాది అంటేనే ఆరంభం. ఆనందాల పండుగే ఉగాది.
ఇంటింటా మామిడి తోరణాలు కట్టేస్తాము.
ముంగిట రంగురంగుల
దీపాలను వెలిగిస్తాము.
కొత్త బట్టలు ధరించి అందరూ సంబరపడతారు.
పెద్దలు ఆశీర్వాదాలు ఇస్తూ మమ్మల్ని దీవిస్తారు.
ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు జీవిత పాఠాలను నేర్పుతాయి.
ఉగాది పచ్చడి జీవితం యొక్క అర్థం చెబుతుంది.
సంతోషం, బాధ రెండూ సమానమని గుర్తుచేస్తుంది.
కాలం కొత్త పుటలు తెరిచేను.
కొత్త కలలు మనసులో
వెల్లివిరిసే రోజు ఉగాది.
కోకిలమ్మ పాటలు
అందరికీ ఇష్టమే.
చెట్లు కొత్త చిగురులతో
అందంగా కనిపిస్తాయి.
భూమి పచ్చని చీర కట్టుకున్నట్టుగా కనిపిస్తుంది.
పల్లెల్లో పండుగ సందడి వెల్లివిరుస్తుంది.
వీధులన్నీ ఆనందంతో కళకళలాడుతాయి.
ప్రతి ఇంటిలో నవ్వులు వినిపిస్తాయి.
కొత్త సంవత్సరం మంచి జరగాలని అందరూ కోరుకుంటారు.
దేవాలయాల్లో ప్రార్థనలు జరుగుతాయి
పంచాంగ శ్రవణం వినేందుకు ప్రజలంతా వస్తారు.
భవిష్యత్తు శుభమై ఉండాలని ప్రార్థిస్తారు.
స్నేహితులు, బంధువులు కలిసి పండుగ జరుపుకుంటారు.
మన సంస్కృతి గొప్పతనం ఉగాదిలో కనిపిస్తుంది.
ఉగాది అంటే కొత్త ఆశల వెలుగు.
ఉగాది అంటే ఆనందాల హరివిల్లు.
ఉగాది అంటే సంప్రదాయాల పండుగ.
ఉగాది మనసుకు కొత్త ఉత్సాహం నింపుతుంది.
ప్రతి సంవత్సరం ఇలా సంతోషంగా రావాలని కోరుకుంటాం.
ఉగాది మన జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుందాం.
వెంకట భాను ప్రసాద్ చలసాని