అక్షర సమూహం
అంశం: నేటి పిల్లల ప్రవర్తన సామాజిక బాధ్యత
శీర్షిక :ఉజ్వల భవిష్యత్తుకు ఆటలు,,,!
రచయిత అపరాజిత్ రెడ్డి
వెలిసిపోయిన కుటుంబాల పిల్లల హృదయాలకు వెలుగుల పుష్పవృంతం ఆటలు
పిల్లలు ఆడే ఆటపాటల్లో మనస్సు తేలికయి హృదయంలోని మబ్బులు వీడి శరీరం హుషారవును
చదువు వెలుగుల సముద్రంలో కెరటాల ఉరవడికి ఆటలు అత్యంత ప్రధానం
పిల్లలు ఉల్లాసంగా గంతులువేస్తూ ఆటలు ఆడుతుంటే ఉద్రేక ఉద్వేగాలు సద్దుమణిగి ప్రశాంత చిత్తులవుదురు
ఆటలతో ఈర్ష్య ద్వేషాలు మాయమై ఒకరికొకరు పోటాపోటీగా ఆటలాడుతూ గెలుపు ఓటముల సైయ్యాట జీవితమని తెలిసివచ్చును
గుండెల నిండా ఆత్మస్థైర్యం స్నేహం కలివిడితనం నాయకత్వ లక్షణాలు స్వేచ్చగా మెలగడానికి ఆటలే ప్రధానం
బలమైన కండరాల శరీర సౌష్టవం ఆరోగ్యం మనస్సు వికసించి జీవితాన్ని తీర్చిదిద్దుకునే క్రమం తెలిసిరావడం లాంటి వాటికి ఆటలే మూలం
చదువు విజ్ఞాన గని ఆటలు దానికి ఉత్ప్రేరకం మనస్సు ప్రశాంతమయి చదువు పట్ల ఆసక్తి పెరుగును
పిల్లలైనా పెద్దలైనా రోజు ఒక గంట ఆటలాడితే శరీరం మనస్సు ఉల్లాసమై జీవితం ఆటుపోట్ల సుడిగుండాలను అలవోకగా ఈదే స్వభావం కలుగుతుంది
బలమైన శరీరం ఉరికే మనస్సుకు గిరిగీసినట్లు ఉద్రేకాలు మాయమై ఆకర్షణీయమైన శరీరంతో మనస్సు జీవితం కళకళలాడుతూ హృద్యంగా సాగిపోయేది కేవలం ఆటలతోనే
అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం ఈ రచన నా కలం సేతయని నా హామీ