ఉపాధ్యాయులు దిశానిర్దేశకులు

సామాజిక కట్టుబాట్లు, విలువలను ప్రబోధిస్తూ దుర్వ్యసనాలకు దూరంగా ఉంటూ జీవన వైవిధ్యానికి మూలం ఉపాధ్యాయులు. తన గుండెల్లో తన కుటుంబ సమస్యల అగ్నిపర్వతాలు రగులుతున్నా విద్యార్థులతో చిరునవ్వులు చిందిస్తూ అద్భుత దిక్సూచిగా నిరంతరం చైతన్యస్వరూలు ఉపాధ్యాయులు.నేడు మారుతున్న సమాజంలో విద్యార్థుల వెకిలిచేష్టలు భరిస్తూ విజ్ఞానం విలువలు ,మన ముందున్న బాధ్యతలు కళ్ళకు కట్టినట్లు బోధిస్తారు. అనుసరణీయం ఆ ప్రభోదాలు, అయినా సినిమాలలోలా దుష్చేష్టలు తరగతిగది పవిత్రతను దెబ్బతీస్తే, దారిమళ్ళించి సన్మార్గంలో దిశానిర్దేశంచేస్తూ చైతన్య స్రవంతులు విద్యార్థులలో సృజియిస్తూ ,తన భోదనలతో జ్ఞానోపదేశం చేసేది ఉపాధ్యాయులు.ఉండవచ్చుగాక దుర్మార్గపు జీవనశైలితో ప్రవర్తనా లోపాలు వున్న ఉపాధ్యాయులు. అందుకని విద్యావ్యవస్థనే తపుపట్టటం శోచనీయం, ప్రమాదం.
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *