అంశం : నేటి పిల్లలు సామాజిక బాధ్యత
శీర్షిక :ఉరిమే ఉరుములు,,,,,,,,!
రచయిత అపరాజిత్ రెడ్డి
క్యేర్ క్యేర్ మంటూ
ఒక్కడొకడుగా పుట్టుకొస్తున్న జనం
ఎక్కడ చూసినా జనం జనం
డబ్బులు తిండి తాగుడు
కోసం ఒకడి నొకడు తన్నుకొనుడు
మోసాలు దగాలు కుట్రలు కుతంత్రాలు
మంచితనం లేషమాత్రమైనా లేని
అడవిమనుషుల్లా జీవనం
ఊరు ఊరంతా ఉరుకులు పరుగులు
ఉరుములు మెరుపుల వాహనాలు ఢీకొట్టుకుంటూ
చస్తూ బ్రతుకుతూ జీవనం
పొద్దస్తమానం పనీపనీ బిజీబిజీ
ఎందుకు బ్రతుకుతున్నామో తెలీదు
పట్టణాల్లో పొగలొదిలే కర్మాగారాలు
దగ్గిరే ఖల్ ఖల్ మంటూ దగ్గిదగ్గి
ప్రాణాలు కోల్పోతున్న వాళ్లేందరో
మురికి కాలువల పక్కనే జీవించేవాళ్ళు కోకొల్లలు
మలేరియా డెంగ్యూ రోగాలకు లేక్కేలేదు
కారుచీకట్లు ముసిరిన సెక్స్ వర్కర్లు
అర్ధరాత్రి ఏ గల్లీలోనో రోతగొలుపు బ్లూఫిల్మ్ ల బాగోతం
పదహారు ఏళ్ళ పిల్లల నుంచి వృద్ధుల దాకా వీక్షకులు
మృగ్యమైన మానవతా విలువలు
స్నేహం పేరుతో వెనుక గోతులు తీసే నీచులు
డబ్బుల కోసం దేనికైనా కక్కుర్తి పడే జనం
నీచ నికృష్ట బడాబాబులకు
నీ బాంచెన్ కాల్మొక్త అనే వెర్రితలలు
చదువుకున్న మేధావులు
సమకాలీన లోకాన్ని విశ్లేషించడమే
తప్ప సామాజిక మార్పుకోసం
ముందడుగు వేయలేని ఆశక్తులు
యువతరం కళ్ళుతెరిచి
ఈ మలిన లోకంలో వెలుగుపుంజాలై
లోకంపై కమ్మిన కారుచీకట్లను పారదోలాలి,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం : ఈ రచన నా కలం సేతయని నా హామీ.