ఈ రేయి కునుకనేది కరువై
దేనికోసమో పడిగాపులు గాస్తున్న జిజ్ఞాస,,,,,
ఈ నిశీధిలో నా కళ్ళల్లోంచి నిప్పురవ్వలు ఎగిసిపడుతూ ఏదోతెలియని దేనికోసమో దేములాట,,,,,
ఈ అగ్గిరాజుకుంటున్న గుండె ఉరుములు మెరుపుల తుఫాను గాలులకు సిద్ధమవుతోంది,,,,
జీవన్మరణ పోరాట యుద్ధం మొదలిడేందుకు మనస్సు కుంపటి జ్వలిస్తోంది,,,,
ఆఖరి పోరుకై ఆలోచనల తరంగాల శరపరంపర జగత్తు నిండా చొచ్చుకెళ్తున్నాయి,,,,
గుమ్ముగా కమ్మగ ఈ ధరిత్రిపై నిస్సిగ్గుగా నిద్దరోతున్న జనం,,,,
స్వేచ్ఛలేని ఒకరి అజమాయిషీ కింద పనిచేసే ఆలోచనలుడిగిన బానిసలు,,,,,
సృజనలేని మనస్సు జఢపదార్ధం
మనస్సుకు హృదయానికి సెగలు తగిలితేనే ఆలోచనల అలజడి,,,,,
ఈ అంతులేని జీవిత పోరాటానికి ఆద్యంతములు లేవు,,,,,
జీవితాలు రొటీన్ గా చాకిరీకి అలవాటు పడిన పెను వ్రణం,,,,
వినూత్న అందాల జీవన సోయగాలను చవిచూడని అనాది నుండి గాయపడుతున్న జీవితాలు,,,,,,
జీవితం ఆఖరి క్షణాల దాకా దేనికోసమో దేములాట,,,,
ఈ మురికి కంపుగొట్టే జీవితాల వేదనలు మటుమాయ మయ్యేదెన్నడు !!??!!
మనస్సు పొరలు కడిగిపారేసే సృజనాత్మక సాహితీ సంపర్కముతోనే ,,,,,,,,
నీలో చైతన్యం రగిలి జీవనశైలి జ్యోతిర్మయమై అద్బుత ఆవిష్కణలు జరిగేది సృజనశీల సాహిత్యంతోనే,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట