కవి కలానికి ఊపిరులూదే గళం
శతకోటి రాగాల మేళవింపుతో ఉర్రూతలూగించే గళం
పాట ముస్తాబై ఇంద్రధనస్సు గొంతెత్తి పాడినట్లు
గాయకుని గళం పూవుల మకరందాల సంగీతవిభావరి,,,,,,,,,
వినూత్న రాగాల గమకాలలో పసందైన కవ్వింపుల రసాస్వాదన,,,,,,,
హృదయం తెరిపించి ప్రాణ ప్రతిష్ట చేసే గానమాధుర్యం ఓ గమ్మత్తు,,,,,,,,
కవి కలంలోంచి సిరా ఒలికి గాయకుని గళంలోంచి రాగాల పల్లకీ ఎక్కి ఊరేగిన చందం,,,,,,,
ఎత్తైన హిమగిరుల్లోంచి జలపాతం దూకినట్లు సాగే గానం మేఘాలు ఉరిమినట్లు జనం కరతాల ధ్వనుల రసాస్వాదన ఓ వరం,,,,,,,,,,,
అది ఆనందమైనా విషాదమైనా అద్భుతమైన కోయిల గొంతుచేసే మాయాజాలంతో జనాన్ని వెర్రెక్కించి చైతన్య జ్వాలలు రేపేది గానం,,,,,,,,,,,
నిజమైన ప్రేమ ఊసుల బాసలు గొంతులో పలికించి యువతను ఆనందడోలికల్లో ఊపేసే గాయకుని స్వరం స్వర్గతుల్యం,,,,,,,,,
జీవనయానం కొనసాగినంతమేరా గానం గంధర్వమై వీనులవిందై మనస్సు పొరల్లో సుమధుర సంగీతం రివ్వున రువ్వుతూ సాగే సెలయేటి గలగలల సూదంటురాయి,,,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట