అక్షర కొరకు
అంశం – చిత్ర కవిత
రచన – ఉమాదేవి ఎర్రం
శీర్షిక – ఎదురుచూపు
ప్రియతమా! నీ కోసం
వేచి ఉన్నాను మనం
ఎప్పుడూ కలిసే పార్కులో
లైటు పక్కన బెంచీలో కూచుని!
నన్ను రమ్మన్నావు నువ్వు
ఇంకా రావేంటి? రోజూ
కలిసే చోటే కదా కొత్తదేమీ
కాదు కదా ఏమిటీ ఆలస్యం?
క్షణ క్షణం నాలో అలజడి
నీవు రావేమెాననే బెంగ
గుండెల్లో తుఫాను రేపుతుంది
గుండె పగిలి పోకముందే రా!
నీ కోసం కలవరించే నా ఈ
చిన్ని గుండెకేం తెలుసు?
అది నీవు రావని తెలిస్తే పగిలి
ముక్కలవుతుంది !
ఏ ముక్క ఎక్కడ పడిందో
వెతుక్కునే ఓపిక నాకు లేదు
పగలక ముందే రావా నా ప్రియా
ఎదురు చూస్తూ ఉంటాం
నేను నాగుండె!
ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నా