ఎర్రని పూవులు

నా చిన్నప్పుడు మా ఊరి పక్కన మోదుగు చెట్ల వనం ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే మోదుగు చెట్లన్నీ ఎర్రని మంటల్లా పూవులు పూసేవి. నేను నా సావాసగాళ్లందరము మోదుగు చెట్లపై ఆడుకునే వాళ్ళం. ఆ ఎర్రని పూవులు ఆ ఎండల్లో వింతగా అద్బుతంగా అగుపించేవి.మేము వాటిని దండలుగా అల్లి సమీపంలోని దేవాలయంలో దేవుడి మెడలో వేసి దణ్ణం పెట్టుకునే వాళ్ళం.హొలీ పండుగకు ఆ పూవులతో ఎర్రని రంగు తయారు చేసి ఒకరిపై ఒకరం ఆ ఎర్రని రంగు గుప్పుకునే వాళ్ళం. మా నాన్న ఆ మోదుగు పూవులను అగ్నిపూవులు అంటారని చెప్పాడు.ఆ పూవులు ఏ పరిమళం లేని అగ్నిజ్వాలలతో ఆలరారేవి.మా నాన్నగారు పోయాక నా జీవితం మండుటెండల్లో పూసే అగ్నిపూవుల మంటల జ్వాలల్లా కష్టాల కన్నీళ్లలో జీవితానికి ఎదురీత అయ్యింది.నిజంగా కొన్నికొన్ని భవిష్యత్ దర్శనాలేమో,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *