ఎవరో ఒకరు

ప్రతి నిమిషానికి ఎవరో ఒకరు ఈ ప్రపంచాన్ని వీడి పోతూనే ఉన్నారు.

మనం అందరం మనకు తెలియకుండానే ఆ వరుసలో నిలబడుకునే ఉన్నాము. మనకు ముందు ఎందరున్నారో మనకు తెలియదు. మన స్థానం ఎక్కడో తెలియదు. అది మారదు కూడా. వరుస నుండి తప్పుంచుకోలేము. వరుసలో కాచుకుని ఉన్నామని, ఒక్క క్షణాన్ని కూడా ఎక్కువగా పొందలేము… ఆ క్షణాలు వస్తాయని తెలుసుకుని జీవించడం తప్ప ఏమీ చేయలేము.

కావున, అవసరమైన వారికి చేతనైన సహాయం చేయండి. ప్రియమైన వారి కోసం మీ సమయాన్ని వెచ్చించండి. న్యాయమైన వారి కోసం మీ సహాయం తోడ్పాటును అందివ్వండి. మాట సహాయమైనా సరే చేయండి. మీ ముందు ఎవ్వరినీ ఆకలితో ఉండనివ్వకండి. చిన్న చిన్న విషయాలను కూడా ఆనందంగా, అందంగా మార్చుకోండి.

మీ చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచడానికి, వారిని నవ్వించడానికి ప్రయత్నించండి. బాధలో ఉన్నవారిని ఓదార్చండి. ఏ కష్టాలు, బాధలు మారే పరిస్థితులు లేవని కృంగిపోకండి. ద్వేషాన్ని పంచకండి. ఎవ్వరినీ బాధపెట్టకండి.

ఎవ్వరూ శాశ్వతం కారని ఆ వరుసలో మనమూ ఉన్నామని తలచుకుని మంచి నడవడికతో చనిపోయినా బ్రతికే ఉండేలా జీవించడానికి ప్రయత్నిద్దాం.
ఇట్లు
మీ
కోటేశ్వరరావు ఉప్పాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *