డా.యస్.టి జ్ఞానానందకవి (జూలై 16, 1922 – జనవరి 6, 2011) ప్రముఖ తెలుగు రచయిత.
జ్ఞానానందకవి 1922జూలై 16వ తేదీన విజయనగరం జిల్లా బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో సురగాలి ఎలయ్య, పాపమ్మ దంపతులకు జన్మించారు. వీరికి చిన్నతనంలో వీరి మేనమామ గుంట యోహాను ప్రేరణ కలిగించారు. వీరు తమ తొమ్మిదవ యేటనే కవితలు చెప్పడం ఆరంభించారు. భీమునిపట్నం, విజయనగరం, కాకినాడలలో విద్యాభ్యాసం చేశారు. సుగుణ మణితో వివాహం జరుగగా ముగ్గురు కుమారులు, ఇరువురు కుమార్తెలు కలిగారు. వీరిలో ఒకబ్బాయి యుక్తవయస్సులోనే మరణించగా మిగిలిన వారు వివిధ హోదాలలో ఉన్నత స్థాయిలో జీవిస్తున్నారు. చివరిదశలో ఆయన దుర్భర దారిద్య్రాన్ని అనుభవించారు. వీరు సాహితీ సమాఖ్య, సాహిత్య కళాపీఠం అనే రెండు సంస్థలను స్థాపించారు. తెలుగులో ఏ పద్యాన్నైనా వర్ణించడంలో అభినవ శ్రీనాథుడనే కీర్తికి పాత్రమైన కవి పద్మశ్రీ డా॥ యస్.టి.జ్ఞానానందకవి. కూలీ నుండి కళాప్రపూర్ణ వరకూ ఎదిగిన ఈయన 2011 జనవరి 6 తేదీన శాశ్వతంగా కన్నుమూశారు.
రచనలు
వసంతగానం (1947)
గాంధీ (1950)
దేశబంధు, పాంచజన్యము (1956)
ప్రభంజనం, పర్జన్యం (తొలి భాగము) (1959)
గోల్కొండ, క్రీస్తు చరిత్ర (1963)
బిరుదులు, సత్కారాలు
విజయనగరం జిల్లాలో 1987 డిసెంబరు 7న కవితా విశారద
విజయవాడలో 1950 మే 20వ తేదీన కవికోకిల
కాకినాడలో 1961ఏప్రిల్ 24న కవిలోక విభూషణ
1968నవంబరు 10వ తేదీన విద్వత్‌కవిచూడామణి
1968నవంబరు 15వ తేదీన సాహితీవల్లభ
1974 జనవరి 27న మహాకవి
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1974 ఆగస్టు 3వ తేదీన కళాప్రపూర్ణ
విజయవాడలో 1974 సెప్టెంబరు 29వ తేదీన అభినవ జాషువ
1974 నవంబరు 1న కాకినాడ పట్టణంలో కనకాభిషేకం
1975లో ఆమ్రపాలి కావ్యానికి ఉత్తమ కవిగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం
1975లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయుడు
బొబ్బిలి చిలుకలపల్లిలో 1975సెప్టెంబరు 28వ తేదీన సాహితీ కృషి వల
1979 అక్టోబరు 28న కవిసార్వభౌమ
రామచంద్రపురంలో 1982 సెప్టెంబరు 28వ తేదీన కవితాశ్రీనాధ
1982లో పద్యవిద్యాప్రభు
1991 ఫిబ్రవరి 7వ తేదీన బ్రహ్మీ విభూషణ
1996లో డి.లిట్
2001లో పద్మశ్రీ బిరుదులను స్వీకరించారు.
జ్ఞానందకవి రచనలను శ్లాఘించిన వారిలో కవిసామ్రాట్ డాక్టర్ విశ్వనాధ సత్యనారాయణ, డాక్టర్ బెజవాడ గోపాల్‌లెడ్డి, ఆచార్యరంగ, డాక్టర్ సి నారాయణరెడ్డి, అయ్యదేవర కాళేశ్వరరావు పంతులు, డాక్టర్ దివాకర్ల వెంకటావధాని, ఆంధ్రసారస్వత రిషదధ్వక్షులు దేవులపల్లి రామానుజరావు, బ్రహ్మీభూషణ కాకకపర్తి కృష్ణశాస్త్రి, జస్టిస్ ఆవుల సాంబశివరావు, డాక్టర్ నందూరి రామకృష్ణమాచార్య, డాక్టర్ కొలకలూరి ఇనాక్, ఆర్‌ఎస్ సుదర్శనం, కవిరాజ మూర్తిలతో పాటు అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రత్యేకంగా అభినందించిన వారిలో ఉన్నారు. భారత మాజీ రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ నుండి జ్ఞానందకవి అత్యున్నతమైన పద్మశ్రీ అవార్డును స్వీకరించారు.
మాధవి కాళ్ల
సేకరణ