ఎ.భీమ్ సింగ్ , తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, చిత్రాల దర్శకుడు, రచయత, నిర్మాత)

ఎ. భీమ్‌సింగ్(1924 అక్టోబరు 15
రాయలచెరువు, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీష్ ఇండియా –
1978 జనవరి 16 (వయసు: 53)
మద్రాసు, తమిళనాడు, భారతదేశం) ఒక దక్షిణ భారత చలనచిత్ర దర్శకుడు. ఇతడు ముఖ్యంగా తమిళ సినిమాలకు పనిచేశాడు. తమిళ భాషతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తెలుగు భాషాచిత్రాలకు కూడా దర్శకత్వం వహించాడు.

ఇతడు కృష్ణన్ సోదరి సోనాని 1949లో వివాహం చేసుకున్నాడు. వీరికి 8 మంది సంతానం. వారిలో బి.లెనిన్ అనే కుమారుడు ఎడిటర్‌గా, బి.కన్నన్ అనే కుమారుడు ఛాయాగ్రాహకుడిగా తమిళ చిత్రసీమలో స్థిరపడ్డారు. మరొక కుమారుడు నరేన్ పంజు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. భీమ్‌సింగ్ 1959లో చలన చిత్రనటి సుకుమారిని కూడా వివాహం చేసుకున్నాడు. వీరికి సురేశ్ సింగ్ అనే కుమారుడు ఉన్నాడు.

భీమ్‌సింగ్ తన వెండితెర జీవితాన్ని మొదట 1940ల చివరి భాగంలో కృష్ణన్ – పంజుల వద్ద అసిస్టెంట్ ఎడిటర్‌గా ప్రారంభించాడు. తరువాత సహాయ దర్శకుడిగా కొంత కాలం పనిచేసి దర్శకుడిగా ఎదిగాడు. ఇతడు తీసిన తమిళ సినిమాలద్వారా ఐదు సార్లు జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందుకున్నాడు.

ఇతడు దర్శకత్వం వహించిన కొన్ని తెలుగు సినిమాలు:

పతిభక్తి (1958)
మనసిచ్చిన మగువ (1960)
మావూరి అమ్మాయి (1960)
పాప పరిహారం (1961)
పవిత్ర ప్రేమ (1962)

వృత్తి ఎడిటర్, రచయిత, దర్శకుడు, నిర్మాత.
క్రియాశీలక సంవత్సరాలు 1949–1978.
భాగస్వామి సోనా (1949–1978) , సుకుమారి (1959–1978). పిల్లలు
బి.లెనిన్ , బి.కన్నన్ , సురేశ్ సింగం

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *