ఏకాంతంతో జీవిత సాఫల్యత

ఏకాంతంతో జీవిత సాఫల్యత,,,,,,!!

కొందరికి ఊరు చివర్నో, చిన్నపాటి కొండపైనో ఏకాంతంగా గడపడం అలవాటు,,,,,,,,,,
ఇలా ఏకాంతంగా గడపడం వల్ల మన బలాలు బలహీనతలు అవగతం అవుతాయి,,,,,,,,,,,,
ఏకాంతంలో హృదయంలో గూడుకట్టుకున్న నిగూఢంగా తపించే బాధలు రహస్యాలు, ఎవ్వరికీ చెప్పలేని విషయాలను ఎంతవరకు పరిష్కరించుకున్నావు, తక్షణ కర్తవ్యం ఏమిటి అనేది బేరీజు వేసుకుని అంతరంగాన్ని స్పృశించి తనకు తాను సమాధాన పడేదే ఏకాంతం,,,,,,,,,,,,,
ప్రస్తుత కర్తవ్యం ఏమిటి రేపుపొద్దున నుండి చేయాల్సిన పనులను నిర్ణయించుకుని జీవితాన్ని సాఫీగా సాగిపోయేలా ప్రణాళికా రచన దృఢమైన మనస్సులో చేసుకోవడం ఏకాంతంలోనే సాధ్యం,,,,,,,,,,,,,
తలపైకెత్తుకున్న కుటుంబ బరువు బాధ్యతల నిర్వహణలో తోడుగా వచ్చేవారితో ఎలాంటి ప్రయోజనాలను సాధించాలి,తాను చేయాల్సిన పనుల స్థితిగతులు ఏమిటనేది నిర్ణయించుకుంటారు,,,,,,,,,,,,,,
జీవితం అన్నాక సవాలక్ష సమస్యలు ఉంటాయి వాటిల్లో కొన్నిటికి పరిష్కారం లేనివి ఉన్నందున్నట్లుగా అంగీకరించి పక్కకుపెట్టి ,మిగతావి త్వరత్వరగా పూర్తయ్యేందుకు రూపాన్నివ్వడం కోసం సాలోచనగా ప్రతి సమస్య పకడ్బందీగా పరిష్కరించుకునే మార్గం ఏకాంతంలోనే సుసాధ్యం,,,,,,,,,,,
ప్రతినిత్యం సాయంసంధ్య ఏకాంతంగా గడపడం జీవిత సంద్రం ఆటుపోట్ల సుడిగుండాలను దాటివేయడం సులువవుతుంది,,,,,,,,,,,,,
అంతే కాదు నీవు ఏకాంతంలో ఓ గంటసేపు లేదా అరగంట ఉన్నప్పుడు నీ మనస్సులోకి cosmic power మానవాతీత శక్తి ప్రవేశించి మానసికంగా దృఢం చేస్తుంది. అలౌకిక భావనలు నీ సమస్యలకు సులువైన మార్గాలు సూచిస్తాయి.,,,,,,,,,,!!

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *