ఐతా చంద్రయ్య(తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి, రచయిత)

ఐతా చంద్రయ్య తెలంగాణా ప్రాంతానికి చెందిన కవి,రచయిత. ఇతడు 1948, జనవరి 3వ తేదీన మెదక్ జిల్లా, సిద్ధిపేట మండలం, చింతమడక గ్రామంలో జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. చదివాడు. హైదరాబాదు హిందీ ప్రచారసభ వారి విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. సీనియర్ గ్రేడ్ హిందీ పండిత శిక్షణ పొందాడు. తపాలాశాఖలో పనిచేసి ప్రస్తుతం సిద్ధిపేటలో విశ్రాంతి తీసుకొంటున్నాడు.

ఇతని రచనలు ఆంధ్రభూమి, చినుకు, పుస్తకం, సాధన, అన్వేషణ, జాగృతి, ఆంధ్రప్రభ, సురభి, కథాకేళి, అమృతకిరణ్, ఆంధ్రజ్యోతి, ఇండియా టుడే, గీతాంజలి, మయూరి, జలధి, ప్రజామత, మూసీ, కళాదీపిక, చిత్ర, తెలుగు జ్యోతి, ఈనాడు, నవ్య, రసవాహిని, కావ్యజ్యోతి, తెలుగు వాణి, కథాంజలి, భావతరంగిణి, మహిళ, ప్రియదత్త, విపుల, స్వాతి, నడుస్తున్న చరిత్ర, చేతన, చతుర, వార్త, రచన తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

ఇతడు వెలువరించిన కొన్ని పుస్తకాలు:

జాతీయ విప్లవజ్యోతి (వీరసావర్కర్ – గేయకథ)
ఇసుక గోడలు (నవల)
చిలకపచ్చ చీర (కథా సంకలనం)
తిక్క కుదిరింది (ఏకాంకిక)
రోజులు మారాలి (హాస్య నాటిక)

కథలు

అంకితం
అంతా … అంతే
అంతా మన మంచికే
అగ్ని పూలు
అగ్ని ప్రవేశం

2019 – తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2016 (హిందీ కథా సంగ్రహం పుస్తకానికి)

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *