ఒంటరితనం దుర్బరం
తోడులేని జీవితము
చూడగా అధ్వాన్నము
ఒంటరితనం నరకము
చరిత్ర చెప్పే సత్యము
కంచె లేని పొలంలా
కాపులేని తరువులా
ఉంటుందోయ్! జీవితము
నీరెండిన బావిలా
అమావాస్య రాత్రిలా
నడిరేయి ధాత్రిలా
ఉంటుందోయ్! తిలకింప
ఏకాకి జీవితము
అందుకే ఆప్తులను
ప్రాణమిచ్చే మిత్రులను
పోగొట్టుకోకూడదు
మన శ్రేయోభిలాషులను
కాపడుకోవాలి…
ఇట్లు
మీ కోటేశ్వరరావు ఉప్పాల