ఓ కన్నీటి గీతం,,,,
ఈ తీయని నొప్పి– బాధ
నీకోసం ఓ దిగులు గీతం ఆలపిస్తున్నాను
ఆశ్రమంలో దిగులు గూడులో దీపం వెలిగించి అరణ్యప్రాంతంలో సీతారాములు కన్నీటి కౌగిలిలో ఆకాశంలో నక్షత్రాల కింద విశ్రమిస్తూ,,,,,,
వెన్నెల వర్షం కన్నీళ్లు కురుస్తున్నట్లు అవనీ తనయిక గుబులు గీతం పాడుతూ సేదయెలాతీరేను రా రామా,,,,,,,
బీభత్స వర్షాలు కురుస్తుంటే ఆ సీతాదేవి సుకుమారి ఎలా తాలగలిగిందిరా రామా,,,,,,
తల్లడిల్లిపోయే చలి, ఎండలకు కుసుమ కోమలి సౌందర్యవతి నారచీరల్లో కుదేలయ్యి లేని ఆనందాన్ని నీపై చూపిస్తే ప్రేమతో లాలించే రామా,,,,,
నీకు కనీసం ఒక్కసారైనా అనిపించలేదా నీ రాజ్యానికి తిరిగి వెళదామని రామా,,,,,,
ఎంత ధర్మపాలదక్షునివైనా నీవాళ్ళంతా క్షమించినా ధర్మో రక్షతి రక్షతః అన్న నీతిలో ఎంతెంత పరమార్థమున్నదో కదా ఎంతటి క్రూరులు హతమయ్యి నీ దీక్ష ఫలియించెను కదా దృఢ కాయుడా సౌందర్య రూపసుడా రామా,,,,,
మీకు సేవచేస్తూ తనకు ఇల్లాలు ఉన్నదన్నది కూడా మరచిన లక్ష్మణుని సహోదర భక్తి ఎంత మహోన్నతమో రామా,,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట