ఓ జీవితం పార్శ్వం,,,,!
ఏదేదో సాధించాలని కలలు కన్న జీవితం కళ్ళ ముందు తెరలు తెరలుగా కదిలిపోతోంది,,,,,,,
యవ్వనంలోని ఉల్లాసాలు ఊహల గాలిమేడలు అన్నీ చిరునామా లేకుండా మాయమై పోయాయి,,,,,,,
చదివిన ఉన్నత చదువులు కారుమేఘాలై కమ్ముకొస్తూ మనస్సు గుబులు గీతాలు ఆలపిస్తోంది,,,,,,,,,
పెళ్ళి పిల్లలు సంసారం సాధారణ బడిపంతులు పిల్లలలో చదువుల ఊపిరిలూదుతూ పునాదులు వేస్తూ బ్రతుకు పుటలను తెరిచి చూపించడం,,,,,,,,
చేదు జ్ఞాపకాల జీవితం చిలక్కోయ్యకు వేలాడదీసి బ్రతుకు జంజాటకం గుర్రపు బండిని లాగుతూ సాగిపోవడమే,,,,,,,
ఉక్కిరిబిక్కిరి చేసే చేదు అనుభవాలను దారిమళ్ళించి ప్రస్తుత కర్తవ్యం దృష్టిలో పెట్టుకుని నిర్వర్తించడమే,,,,,,,
రిటైర్మెంట్ దగ్గరపడుతుంటే ఆరోగ్యం సహకరించక సతమతమవుతున్నా పిల్లలకు నేర్పే చదువులలో తేడా రానీయకుండా తెరలు తెరలుగా వచ్చే దగ్గును ఆపుకోలేక అల్లల్లాడుతూ గుండెల నిండా గాలిపీల్చుకుని నాకై నేను ఉపిరిలూదుకోవడమే ఇంతకంటే ఏం చేయగలం గుండెలవిసి పోతుంటే,,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట