ఓ జీవిత పార్శ్వం

అక్షర సమూహం (కథనం)
అంశం :నేటి పిల్లల ప్రవర్తన–సామాజిక బాధ్యత
శీర్షిక :ఓ జీవిత పార్శ్వం !!
రచయిత : అపరాజిత్ రెడ్డి

అతను మొద్దు పలకపై అక్షరాలు దిద్దినా
చిరిగిన బట్టలు ధరించి పుస్తకాల సంచి బుజానేసుకుని
అక్షరాలను కనురెప్పల కింద దాచుకుని
గజిబిజి అంకెల గారడీ తమాషా లెక్కలను ఇట్టే సాధించే ధీశాలి
తన చదువు అన్నం పెడుతుందన్న నమ్మకం లేకున్నా
సరస్వతీ పుత్రుడై పాఠశాలలోఅన్ని రంగాలలో ధీశాలియై
ఒకపూట తిని ఒకపూట తినక పస్తులతో కొన్ని రోజులు అలమటిస్తూ
చదువే తన వ్యాపకమై సెలవులలో కూలీ పనులకెళ్తూ
ఆకాశంలో మబ్బుల్లో తన తల్లి తండ్రుల ఆకలి పేగుల చప్పుడులా ఉరుములు మెరుపుల జడివానలో తడిసి ముద్దయి
చదివే చదువు ఆపేయటమా ఎలా పది వరకు చదివి ఆపేద్దాం అని ధృడనిశ్చయానికొచ్చి
ఎటు చూసినా అంధకారం ఆకలి కేకలు
బడిలో చదువులలో ఆటల్లో అన్నిట్లో తానే ముందు
అయినా తన హృదయ నైరాశ్యం తన తోటి విద్యార్థులకు తెలియనీయని తత్వం ఆ వయస్సులోనే
రాత్రి పొద్దుపోయిన తర్వాత నిద్రపోబోతే తన భవిష్యత్ నిషిరాత్రి నీడల్లా పరుచుకున్న చందం
జీవితం పలుగు రాళ్ళ బోడుపై నడకలా తోచి ఏడుద్దామన్నా కన్నీళ్ళు ఇంకిపోయి
ఆ సంవత్సరం పది పరీక్షలు రాస్తే తనను జీతం ఉంచుకోవడానికి పటెండ్లు సిద్ధంగా ఉన్నారు
పది బోర్డు పరీక్షలు స్ట్రిక్ట్ గా జరిగాయి తను ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు
ఆశ్చర్యం వేలకు వేలు పోసి పట్నంలో చదివిన పటెండ్ల కొడుకులు ఫెయిల్ అయ్యారు
తిండికి గతిలేని తను ఫస్ట్ క్లాస్
తనకు సర్టిఫికెట్స్ ఇచ్చేప్పుడు హెడ్మాస్టర్ సర్ సాంఘిక సంక్షేమ హాస్టల్ వార్డెన్ అడ్రస్ ఉన్న కవర్ ఇచ్చి పట్నంలో హాస్టల్ లో చేరి కాలేజీలో ఇంటర్ చదువుకొమ్మన్నాడు
అదే తన దశ తిప్పింది మొక్కవోని దీక్షతో చదువుకున్నాడు
హోమ్ ట్యూషన్ లు చెప్పాడు పగలనక రాత్రనక బ్రతుకు పోరాటం ఈదాడు!!
ఆకాశంలో నెలపొడుపు పొడిచింది టీవీలల్లో రేడియోల్లో ఒకటే మోత తాను ఐ ఏ ఎస్ కు సెలక్ట్ అయ్యానని
అమ్మా అయ్యలు బిడ్డా నీ శ్రమ దేవునికి స్తుతి ముట్టింది రా నాయన
పేదింటి బిడ్డడంటే ఏమిటో తెలిసేట్లు నిరుపేదలు నిర్భాగ్యులు అనాధల పక్షాన నిలబడు కొడకా
అంటూ అయ్య చెప్పినవి తన పరిధిమేర సహాయం చేసే నిరుపేదల పక్షపాతి అయ్యాడు,,,,,,,,,,,,
భువిపై ఒక జ్ఞాని ప్రకాశిస్తే ఆకాశంలో వేయి నక్షత్రాలు ఉద్బవిస్తాయ్,,,,,,,,,,,,,,,,,,,!!

అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం : ఈ రచన నా కలం సేతయని నా హామీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *