ఓ నా అక్షరమా

ఓ నా అక్షరమా,,,,,!!

ఈ కన్నీటి ఎదతో కడదాకా ఈదలేనేమో. నేను శూన్యంలో శూన్యం ఎప్పుడు అవుతానో గదా ! అలుపెరుగని అక్షరాలతో పోరాటం కేవలం పదేళ్ళ పగుళ్ళ జీవిత ప్రస్థానం.నా అక్షరాలు మొదట్లో నవ్వులపాలయ్యాయి. ఇదేం జీవితం ఇవేం రాతలని ఇప్పటికీ నగుబాట్ల మధ్య కొనసాగుతున్న అక్షరాల ఎదురీత. అందం కోల్పోయిన వాడిపోయిన పుష్పాలు నా రచనలు. దిక్కుతోచని ఒక్కరైనా చదవకపోతారా అని పేరాశ. నగుబాట్ల జీవితం లిఖించే అక్షరాలు విషాదగ్రస్తమైన జీవితాలే ఎంచుకుని ఊపిరిబాసలు రగిలించడమే. ప్రకృతి ఒడిలో నేను పరవశున్నై ఆకాశంలో నక్షత్రాల బదులు అక్షరాలు చదివే రూపాయికి కొరగని కవిత్వం రాసేవాన్ని. నన్ను నా రచనలను తిరస్కరించే కుసంస్కారివి. నా అక్షరాల పూవులన్నీ గొళ్ళుమని బావురుమంటున్నాయి.నీకు నిద్రలేని రాత్రుల్లో నా కవిత్వం చదువు అక్షరమై విరబూస్తావు. అవును !!ఇదో వెర్రి మిత్రమా !!
శ్రామికుల దుర్భరజీవితాలు వడబోసి నీ గుండెల్లోకి ఒంపుదామని రాస్తే పేజీలు తిరగేస్తూ చెప్పొచ్చాడులే ఏదో తెలిసినట్లు వకల్తాపుచ్చుకుని మహా అంటూ గిరాటేసే నైజం నీది.,,,,,,,!! ఇక నేను రాసి ఏంలాభం !!

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *