నిన్ను కన్న నీ తల్లిదండ్రుల దురదృష్టమో
లేక పోలియో బారిన పడ్డావో,,,,,,,
నీకు కాళ్ళు లోపించి ఈ గిరకల బండీ తోసుకుంటూ జీవనం సాగిస్తున్నావా తల్లీ,,,,,,,,
అయితేనేమి ఆత్మవిశ్వాసం గుండెల నిండా నింపుకున్న సహోదరి,,,,,,,,,,
నీ లోపం తెలిసినా నిన్ను పెళ్ళాడి బిడ్డను కూడా కన్న నీ భర్త హృదయం వెన్నపూసయని నీ అచంచలమైన హృదయ సంతృప్తే చెబుతోంది,,,,,,,,
నీ బిడ్డను ముద్దిడుతూ గోముచేయడమే కాదు సుమీ,,,,,,
అచంచల దీక్షతో చదువులో మేటిగా తీర్చిదిద్దు నీ బిడ్డ ఆటపాటల్లో ఆనందిస్తూ,,,,,,
నీ సంసార సుఖదుఃఖాల్లో నీవు చేతులతో చేయగలిగిన పనులు నిర్విరామంగా నైపుణ్యంతో చేస్తూ నీవు నీవుగా బ్రతుకు నీ బిడ్డ ఎదుగుదల గమణిస్తూ,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట