ఓ హృదయ ఘోష

హృదయం పగిలిన శిలలై
పెనుగాయాల వ్రణాల
నగుబాట్ల జీవితం కొనసాగినంత మేరా
జీవనగతులు బీడుబడిన భూమియై
ఖండఖండాలైన మనస్సు గూడు
ఎవ్వరూ అతకలేని
పగిలిన అద్దం జీవితం
ఎద చీకటి సముద్రం
ఏళ్లకు ఏళ్ళు గడిచిపోతున్న
దుర్దినాలు జీవితమంతా

ఎప్పుడు ఎక్కడ నుండో
ఏం జరిగిందో ఏమో
వీచే చల్లని గాలులతో
కారుమబ్బులు కమ్మి
భారీవర్షం కురిసి
నెల చిగుళ్లు తొడిగిన వృక్షాలతో
బీడుభూములన్నీ పంటచేలయ్యాయి
గుండెల నిండా అమృతవర్షం
కురిసిన చందం
హృదయం గద్గదంగా
ఊపిర్లు పోసుకుంది
దుఃఖిత హృదయంలో
జీవజలములు పారాయి
పసిడి కాంతుల నవోదయంలో
జీవితంలో మందారాలు వికసించాయి
అంతే ఇక వెనక్కి తిరగను
తిరిగానో ఆ నిద్రలేని
గుండె కోతలే జ్ఞాపకాలలో
శ్రుతతప్పిన విషాద సంగీతం
హృదయాన్ని పిండేస్తుంది
హృదయ సంద్రం
ఎగిసేపడే కెరటాలను వీక్షిస్తూ,,,,,,
జీవితం కొనసాగింపులో,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *