కం!!💐💐💐💐

సింహముల వంచ వచ్చును
సంహారము జేయవచ్చు శౌర్యులనైనన్!
సింహాసనముదిగుచు నా
సింహతలము జేయమేలు శ్రీమతికిపుడే!!

సింహతలము తలవంచుట
రెండుచేతులు జోడించి మ్రొక్కుట.

దారను గెలిచిన వీరుని
నేరుగ చూడంగ లేము నెప్పటికైనన్
దారను ప్రేమించిన తా
భారమ్మును మోయుచుండు బ్రతుకుచు కృష్ణా!

తలవంచను రౌడీలకు
తలవంచను రాజనీతి ధర్మమ్మునకున్
తలవంచను సింహాలకు
తలవంచక తప్ప లేదు దారకు కృష్ణా!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *