మక్కువతో చదివించిన
చక్కని సంతానమెల్ల జగతిని యేలన్
లెక్కకు మించిన సంతుయె
రక్కసులుగ మారుచుంద్రు రయమున కృష్ణా!!
తే!!గీ!!💐💐💐
కులము లేదన్న మూర్ఖుల గూల్చవోయి
మతము లేదను మౌఢ్యుల మాడ్చవోయి.
కులమతాలు లేని పుడమి యిలనులేదు
తెలుసుకోవయ్య కృష్ణయ్య తెలివితోడ!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట