ఎన్నికల వేళ మరువక
మన్నికగా శిక్షణ గొని మౌనముగా తా
సున్నితపు నిర్వహణలో
దన్నుగ నిలువంగ వలయు తప్పక కృష్ణా!!
బ్యాలటు బాక్సులు చేకొని
బ్యాలటు పత్రాలు పొంది బాధ్యత తోడన్
బ్యాలన్సుగ ఎన్నికలను
మేలుగ నడిపించి పొందు మెప్పును కృష్ణా!!
లక్కను వాడుచు బాక్సును
చక్కగ సీల్జేసి పెట్టు జాగ్రత తోడన్!
లెక్కించెడి సమయమ్మున
నొక్కొక్కటి సరిగ జూడుమో శ్రీ కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!