సురసేవిత నరపాలక
పరపతినిడు దేవదేవ పన్నగ శయనా!
శరణంబంచును మ్రొక్కెద
సరగున రావేర గోప సన్నుత కృష్ణా!!
కరచరణములదిలించుచు
సురభులపై ప్రేమ జూపు సుందర మూర్తీ
మరకత మణిమయ భూషణ
మురళిని వాయించు వాడ మోహన కృష్ణా!!
ధనమును కలిగిన వేళను
వినరా దాయాదులైన విడ్డూరముగా
మనవాడంచును వీడక
ననుదినమును ననుసరించు నవనిని కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!!