నేటి సమాజంలో తెలుగు అనే భాష ఉన్నట్టుగా కూడా ఎవరికి తెలియడం లేదు ఎందుకు అంటే బ్రతకడానికి ఆంగ్ల భాషను ఎక్కువగా వాడుతున్నారు ఆంగ్ల భాష బ్రతకడానికి ముఖ్యమే కానీ అదే సమయంలో తెలుగు భాషను కూడా కాపాడుకునే బాధ్యత కూడా మనదే ఇప్పటి తరం పిల్లలు తెలుగు మాట్లాడాలంటే దానిని ఇంగ్లీషులో రాసుకోని చదువుకుంటున్నారు ఒకదానికి అర్థం చెప్పమన్నా కూడా దాన్ని మరొక అర్థంలో ఇంగ్లీషులో చెప్పమని అంటున్నారు అసలు అక్షరాలు రాని వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఒక రాష్ట్రంలో వారి భాష కోసం వారు కూడా పోరాడుతూ సినిమాలు కూడా తీస్తూ ఉంటే మన తెలుగు వారు మాత్రం తెలుగు భాషను చంపేస్తూ ఉన్నారు అసలు తెలుగు భాష అంటేనే విరక్తి చూపేవారు ఎంతోమంది ఉన్నారు తెలుగులో మాట్లాడిన వారిని చిన్నతనంగా చూసేవారు చాలామంది ఉన్నారు. మనం తెలుగులో మాట్లాడిన చిన్న చిన్న పదాలను కూడా ఇంగ్లీషులో చెప్పండి అని అడుగుతూ ఉన్నారు ఇక తెలుగులో రాసిన కొన్ని వ్యాసాలను ఇంగ్లీషులో ట్రాన్స్లేట్ చేసుకొని మరీ వింటున్నారు రాసుకుంటున్నారు తప్ప నేర్చుకోవాలని ఎవరూ అనుకోవడం లేదు తెలుగు భాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయని కూడా ఎవరికీ తెలియదు పరాయి భాష ఎప్పటికైనా పరాయి దే, బతకడానికి ఆంగ్లభాష అవసరమే కానీ తెలుగు భాషను కన్నా తల్లి భాషను మాతృ భాషను మర్చిపోవడం దానిని మాట్లాడడానికి సిగ్గుపడడం మేము తెలుగువారిమీ అని చెప్పుకోవడం సిగ్గుచేటుగా చేస్తున్నారు. చాలామంది చాలావరకు సాంకేతికత పెరిగి మన యు ట్యూబ్ ఛానెల్ లో కూడా దేవుడి స్తోత్రాలు కూడా ఆంగ్లంలో పెట్టడం ఎంత సిగ్గు చేటు. ఎటు పోతుంది మన సాంప్రదాయం,మన బాధ్యత,మన పౌరుల మనస్తత్వం మారాలి. ఐటీ కంపెనీలో వాళ్ళు కేవలం ఆంగ్లం మాత్రమే మాట్లాడాలి అని అంటున్నారు. పాఠశాలల్లో కూడా తెలుగు మాట్లాడినందుకు జరిమానా కూడా విధి స్తున్నారు ఇది ఎంత హేయమైన ఘటన తెలుగు మాట్లాడితే జరిమానా విధిస్తారా ఎవరైనా? చాలామంది పిల్లలకు తెలుగు పద్యాలు తెలుగు సామెతలు తెలుగు పాటలు తెలియడం లేదు ఈరోజుల్లో సినిమాలలో కూడా తెలుగు పాటను ఖూనీ చేసి పాడుతున్నారు.తెలుగు మాట్లాడకపోవడం అంటే మన కన్నతల్లిని మర్చిపోవడమే అందుకే మనం మన భాషనైనా తెలుగు భాషను కాపాడుకుందాం తెలుగువారిని గౌరవిద్దాం. ఒకవేళ మనం తెలుగు భాషను కాపాడకపోతే ముందు తరానికి ఒకప్పుడు తెలుగు భాష ఉండేదట అని చెప్పుకోవాల్సిన పరిస్థితి రావచ్చు కాబట్టి తెలుగు భాషను కాపాడుకుందాం జయహో తెలుగు.
తేనెకన్నా తీయనిది తెలుగు భాష
దేశభాషలందు లెస్స తెలుగు భాష తేనె కన్నా తీయనిది తెలుగు భాష…..