కనువిప్పు (చిత్రకథ )

రాజశేఖరం ఆస్తిపాస్తులున్న గౌరవం గలిగిన కుటుంబంలో ఒక్కగానొక్క కుమారుడు. చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు అడిగింది ఏది కాదనకుండా సమకూర్చేవారు.డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు. తాను చదివే కాలేజీలో ఒక అమ్మాయితో ప్రేమలో పీకల్దాకా మునిగితేలాడు. అమ్మాయి తల్లిదండ్రులు ఈ ఆవరేజ్ చదువుల రాజశేఖరంను కాదని, వేరే అతనితో పెళ్లిచేసి పంపించారు.
దాంతో దిక్కుతోచని రాజశేఖరం చేతి నిండా డబ్బులు ఉండడం వల్ల విచ్చలవిడిగా ఖర్చుచేస్తూ మందులో మునిగితేలుతూ ఒంటరయ్యాడు.
రాజశేఖరం తల్లిదండ్రులు మారు ఆలోచించకుండా చిన్నపాటి ఉద్యోగం చేసే నిరుపేద అమ్మాయి రాగిణి తో పెళ్ళి చేశారు. అలాగైనా బాగుపడి జులాయి వెధవలతో తాగుడు మానుకుని ప్రయోజకుడు అవుతాడని ఆశపడ్డారు.
కాని వాళ్ళ ఆశలు ఆడియాశలు అయ్యాయి.రోజు తాగి రావడం పరిపాటు అయ్యింది.
ఒకరోజు పూటుగా రెండు ఫుల్ బాటిళ్ళు తాగి మెడకేసుకుని ఇంటికి వచ్చాడు. రాగిణి తిక్కకోపంతో చెడా మాడా చివాట్లు పెట్టింది.నీవేం తల్లి పాలు తాగే పసిపిల్లాడివి కావు. ఎలా బ్రతకాలో తెలియని వెధవ్వి పెళ్లి ఎందుకు చేసుకోవాలి. అంటూ చివాట్లు పెట్టింది. ఆ మాటలకు దిమ్మదిరిగి తూలి కిందపడి మైకం కమ్మి గుమ్మం ముందే స్పృహ కోల్పొయాడు.
అది హాస్పిటల్ ఐ సి యూ పేషంట్ల చాంబర్. రాజశేఖరం చుట్టూ సెలైన్లు ఇంజక్షన్స్ వేస్తున్న సిష్టర్ లు కనిపెట్టుకుని బ్రతికేందుకు తాము శాయాశక్తుల ప్రయత్నం చేస్తున్నారు.
రాజశేఖరం కళ్ళు తెరిచి హఠాత్ పరిణామానికి బిత్తరబోయి తనకేమైంది అని అడిగాడు.
అంతలోనే డాక్టర్ వచ్చి నీవు విపరీతంగా తాగుడుకు బానిస అవడం వల్ల నీ బ్రెయిన్ లో నరాలు దెబ్బతిని చావు బ్రతుకుల్లో ఉంటే నీ భార్య రాగిణి నిన్ను ఇక్కడ సమయానికి చేర్పించింది,లేకపోతే చనిపోయే వాడివి.
వారం రోజుల తరువాత రాజశేఖరం కోలుకోగానే అయిదు లక్షలు హాస్పిటల్ బిల్లు తనముందే రాగిణి చెళ్లిస్తుంటే రాజశేఖరం గుండె గుబగుబ లాడింది.నిస్తేజంగా కళ్ళల్లోంచి నీళ్ళు ఉబికివచ్చాయి.రాగిణీ అంటూ బిగ్గరగా వాటేసుకుని ఏడేస్తున్న భర్తను చూసి జాలేసింది. రాగిణి భర్తను తీసుకుని ఒకే రూము ,కిచెన్ ఉన్న ఇంటికి తీసుకెళ్లింది. మిమ్మల్ని బ్రతికించుకోవడానికి మీ అమ్మానాన్నలు ఇల్లు అమ్మి ఈ గది అద్దెకు తీసుకుని వాళ్లిద్దరూ వృద్దాశ్రమంలో చేరారు. తప్పదు ఏం చేస్తాం అంటూ నులకమంచం వేసింది పడుకోమని.
రాజశేఖరం దిమ్మదిరిగి పోయింది. ఏం చేస్తాడు పాపం. భార్య రోజు ఆఫీసుకు వెళ్లివస్తు తనను కంటికి రెప్పలా చూసుకుంటుంటే తానేం చిన్నపిల్లాడు కాదు కదా.పాతికేళ్ళు నెత్తిమీదికి వచ్చాయి. డిగ్రీ చేసి ఉండడం వల్ల ఒక కంపెనీలో గుమస్తాగా చేరి నెలకు వెయ్యి రూపాయిలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు తనపై తనకు ఆత్మవిశ్వాసం ఏర్పడింది.తాగుడు జోలికే వెల్లట్లేదు.దారిలో పడ్డాడు.
రాగిణికి ,రాజశేఖరం తల్లిదండ్రులకు కావలసింది అదే.వాళ్ళ నాటకం ఫలించింది. ఐదు వేలు హాస్పిటల్ ఖర్చులు చెల్లించి డాక్టర్ నర్సులతో బ్రెయిన్ లో నరాలు తెగినవని అబద్ధం చెప్పించారు అంతే,,,,,,,,,!!

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *