అక్షర కొరకు
అంశం :- చిత్రానికి కవిత
తేది:- 07/12/2025
శీర్షిక:- కన్నవారి అదుపులో ఉండండి
మీ పేరు: విత్తనాల విజయకుమార్
హైదరాబాద్
ఈ రచన నా సొంత రచనని హామీ ఇస్తున్నాను.
•••••••••••••~•
ఆమె కోసమే కదా ఎన్నో కథలు అల్లాను.
ఎంతగానే ప్రయత్నించి పరిచయం పొందాను.
వస్తానని మాటిచ్చింది.
వచ్చి తీరుతుందని నమ్మాను.
ఎన్నో ఉహించు కొన్నాను.
నా ఊహలన్నీ ఏమైపోవాలి.
ఆమె రాకపోతే ఏం చేయాలి.
ఎలా రప్పించగలగాలి.
వార్డెన్ ను ఎలా బురిడీ కొట్టించాలో చెప్పానే …
చెప్పింది చెప్పినట్లు చేయలేకపోయిందా!
కొత్తగా నాకు చేరువైన స్నేహితుడిని బయటకు పంపానే!
ఆమెతో ఒంటరి పొందును పొందాలనుకున్నానే!
ఆమెను ముగ్గులోకి దించటానికి పడ్డ కష్టం ఏమైపోవాలి!
వెనకా ముందూ ఎవరూ లేరని నమ్మించాను.
మంచి ఉద్యోగం చేస్తున్నానని చెప్పాను.
పువ్వుల్లో పెట్టుకుని చూస్తానని చెప్పాను.
ఎక్కువగా పీడించి నందుకే ఊరేసుకుంది నా గత గొర్రె.
ఈ గొర్రెతో తీసే వీడియోతో జాగ్రత్త పడాలి.
ఇది కొంచెం గట్టి ఘటమే.
ఈ స్తితికి తేవడానికి చుక్కలు కనపడ్డాయి.
ఆ అమ్మాయి
మారువేషంలోని పోలీసనీ …
రూమ్ లోని స్నేహితుడు ఆమె సహాయకుడనీ,
కటకటాల వెనక్కి వెళ్ళాక తెలిసిందా మోసగాడికి.
మోసపోయిన అమ్మాయిల వెతలను కని గొర్రెలుగా బలికాకండి.
నిండు నూరేళ్ల జీవితాన్ని కన్నవాళ్ళ అదుపులోనే ఉంచండి.