అక్షరరచయితలు
తేదీ : 29/12/25
అంశం- నేటిపిల్లలు సామాజిక బాధ్యత
శీర్షిక- కళ్ళు తెరిచి విలువలు నేర్పండి
రచన: విత్తనాల విజయకుమార్
హైదరాబాద్
ఈ రచన నా సొంత రచనని హామీ ఇస్తున్నాను
•••••••••••••~•
ఉగ్గు పాలు పిల్లలకు పోషకాహారం
పోషకాహారంతోనే తల్లుల నుండి విలువలు
విలువలకు మూల గురువు అమ్మే
ఆ పిదపే తండ్రీ గురువువూను
మూల గురువు అమ్మకి ఎక్కడినుండి వచ్చాయి విలువలు!
వాళ్ళమ్మో, అమ్మమ్మో, నాయనమ్మోనే కదా చెప్పుండాలి!
అమ్మమ్మా నాయనమ్మలు ఇప్పుడు ఎక్కడున్నారులే!
మూల గురువమ్మే కాలంతోపాటు మారిపోయిందే!
ఉగ్గుపాలను తోసేసి సీసా పాలొచ్చేసే!
విలువల కథలను కాదని స్మార్ట్ ఫోనులొచ్చేసే.
మాటలు నేర్పించి పలికించే పలుకులు తెలుసా!
మమ్మీ డాడీ అంకుల్ ఆంటీలే అన్నీనూ.
అమ్మా నాన్నా అత్తా తాతాలు వినపడనే వినపడవు కదా!
ఆ పలుకుల తోనే ప్లే స్కూల్లోకి ప్రవేశాలు.
అక్షరం చెప్పకుండానే లక్షల రుసుములు.
కాన్వెంట్లో సీటుకి పడే పాట్లు చెప్పాలా!
తల్లితండ్రుల జీతాల్లో ఒకరి జీతం చదువులకే!
ఉరుకుల పరుగుల వేగంతో విద్యాభ్యాసం.
వంటబట్టిన విజ్ఞానాన్ని వదిలేసి మార్కులతో పోటీ.
కృత్రిమ మేధతో అసలు మేధ కనుమరుగు.
మారిన లోకానికి తగ్గట్టు మారితేనే గతి.
తల్లితండ్రులారా గుర్తుపెట్టుకోండి.
నేటి మీ పిల్లల ప్రవర్తనకూ, సామాజిక బాధ్యతలకూ …
మీరు అవునన్నా కాదన్నా మీరే కారణం.
ఎన్ని మార్పులు వచ్చినా కళ్ళు తెరిచి విలువలు నేర్పండి.
•••••••••••••