కాగితాల విలువ పెంచలేని సాహిత్యం

కాగితాల విలువ పెంచలేని సాహిత్యం,,,,,!

కళ్ళు మూసినా తెరిచినా నీ రూపమే దేవరా
నా అక్షరాలన్నీ తూకంవేస్తే నేనే బాకీ పడుతున్నా
ఇవి భగవంతుని స్తుతి గీతాలు దేవరా కాస్త వెలకట్టు
ఇవి దివ్యవాక్కుల సంకీర్తనలు దేవరా కాస్త కనికరించు
ఇవి భగవంతుని సృష్టి ప్రకృతిలోని జలపాతాలు,కొలనులు ,పర్వతసానువులు అద్భుత కీకారణ్యాలు అందులోని ప్రాణులు దేవరా దయతలచు,,,,
ఇవి మహిళల స్వయం సంవృద్ధికి మానప్రాణాల రక్షణ కోసం వాళ్ళల్లో చైతన్య స్వరాలు పలికించడం కోసం రాసిన కవితలు దేవరా కాస్త ఏమన్నా దయచేయి,,,,,,
ప్రకృతి వైపరీత్యాలు రైతుల శ్రామికుల కడగండ్లు దుఃఖిత మది రోదనలు దేవరా కాస్త విలువివ్వు,,,,,,,
ఏం ఏంటయ్యా చెత్తకుప్పలా రాతలు నీవూనూ ఈ చెత్తాచెదారానికి అయిదు రూపాయల కంటే ఎక్కువ ఇవ్వను,,,,,,!
ఇవి యువతను మేల్కొలిపే చైతన్య గీతాలు దేవరా ఓసారి నీ వెనక్కి చూడు,,,,,
నలుగురు యువకులు అతన్ని బంధించి అత్యంత విలువైన ప్రతులు నీకు చెత్తాచెదారంలా అగుపిస్తున్నాయా పచ్చకామెర్లోడా కక్కు డబ్బులు మాకు ఓపికలు నశించాయో ఇక్కడే సమాధవుతావ్ జాగ్రత్త అంటుంటే ,,,,,,,చిత్తం చిత్తం అంటూ తగిన వెలకట్టాడు,,,,,,,
ఈ లోకంలో సాహిత్యం విలువ కోల్పోయింది కానీ కాగితాలకు విలువవుంది,,,,,,,,!!

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *