ఈ చీకటి కౌగిలింతలో
కళ్ళ నిండా అక్షరాలు అలుముకుని
భావాల కుసుమాలెన్నెన్ని
ఈ కారుచీట్లు మింగేశాయో !
ఈ నిశీధిలో ఓ చిరుదివ్వె వెలిగించి
ఈ చరవాణిలో అక్షర బింబమై
మనుష్యులలో ప్రేమలు ఏమాత్రం లేని
హేయమైన మూసుకుపోయిన వికృత కామం కళ్ళు
చిత్రీకరించనైతినే అనే గుంజాయిషి
తమకు పేరు ఉనికికి నోచుకోని
గుండెల్లో అణుబాంబులు పేలుతున్న సెక్స్ వర్కర్లు
మగాడి కామకోర్కెల క్రూరత్వంలో
బ్రతుకు తెరువు వెతుక్కుంటూ
ఆకాశం చిల్లులు పడేలా రోదిస్తూ
బుక్కెడన్నం తినేందుకు
రాత్రిపూట పుష్పించిన రేరాణులు
పేలవమైన నవ్వుల నల్లగులాబీలు
క్రూరమృగాల కళ్ళల్లో లేడికూనలు
ఆకాశ దర్పణంలో వెలగలేని నక్షత్రాలు
దినం దినం చిదిమివేయబడుతున్న మాంసం ముద్దలు
గుండెల్లో ధైర్యం నూరిపోసుకుంటూ
ఎప్పుడో అగ్నిపర్వతం బద్దలైనట్లు
గుండెల మంటల్లో కూలిపోయే అర్థాశ్కులు
మీకంటూ హృదయం ఉందని
మనస్సు కలలుగనే కళాతపస్వినులు
కళ్లులేని కబోదుల కామం నిండిన కళ్ళు
మీ శరీరాలతో విందు చేసుకునే మృగాలు
ఆకలి కేకలతో అంబరాన్నంటే రోదనల్లో అశువులుబాస్తే
ఆ ఉసురు ఊరికే పోదు
కాళికామాత కళ్ళు తెరిచి
భీకర వడగాలుల్లో అగ్నిసామాధులు
కారుమబ్బులు కూలిపడుతూ,సునామీలు, భీకాతుఫానులు
భూకంపాలు ,ఈదురుగాలులు
లక్షలకు లక్షల జనాలు చీమల్లా కొట్టుకుపోతూ
రేపు మిగిలేది మనసున్న మహారాజులే
ఇకనైనా ఈ మృగాలకు పరివర్తన కలగాలి కదిలించాలి,,,,,,
అపరాజిత్
సూర్యాపేట