కాలం గుండెలపై కవాతు,,,,,,!!

ఈ పర్వత సానువుల్లో అనాది జనం గుండెల చప్పుడు వినిపిస్తున్నాయి,,,,,,,,,,,
రధాలు లాగుతూ ఉరకలేసే గుర్రాల కనుపాపల్లో సామాన్యుని అనిచివేతల వెట్టిచాకిర్ల దుఃఖాలు సుడులై తిరుగుతూ,,,,,,,,,,,,,
పర్వత శ్రేణుల చెంత దిగులు గూళ్ళు కట్టుకుని బిక్కుబిక్కుమని బ్రతుకే బ్రతుకుపోరాటం అభాగ్యుల దీనావస్థలు గింగురుమంటున్నాయి,,,,,,,,,,,,,,
ఈ గిరుల్లో కొలనుల నీళ్ళు తాగడానికి జలకాలకు తమ పెంపుడు జంతువుల దాహార్తికి ,మౌనంగా వెళ్ళిపోతున్న కాలం తాలూకు ఆనవాళ్లు కొండలు కోనలు ప్రతిధ్వనిస్తూ నిగూఢ సమాధానం,,,,,,,,,,,,
కాలం మనిషిని భుజానేసుకుని మౌనంగా ఈ భువిపై ఊగిసలాడే వరదలై సాగిపోతున్న జనసందోహం ఆర్తనాదాలు ఆహాకారాలు ఆనందాల వెల్లువలు,,,,,,,,,,,,,
కూలిపడుతున్న కొండచరియలు గుర్రాల కవాతులు యోధులనబడే నరరూప రాక్షసుల చేతుల్లో అభాగ్యులు, మహిళల మిన్నంటే ఆర్తనాదాలు కాలాన్ని దహించే అగ్నిపుంజాలు,,,,,,,,,,,,,
ఆటవిక జనాన్ని నిర్దయగా బానిసలుగా చేసుకునే రాచరికాలు యుద్దాలలో అణగారిన ప్రజలు సమిదలై ఆకలి కేకల్లో ఆహుతులై రాజ్యాలు రాజులు కాలికూలిపడ్డ కోటలు సామ్రాజ్యాలు దోపిడులు,,,,,,,,,,,
కాలం మింగేసిన దొరలు దొరసానులు సంస్థానాలు అరాచకాలు పేదవాడి కష్టం మింగే దురాగతాల తదుపరి ఆఖరి కేకల్లో ధనస్వామ్యం కొనసాగింపులో రక్తం మరిగే నిరుపేదల సాక్షిగా కదలిపోయే కాలం నిర్జీవంగా,,,,,,,,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *