అక్షర సమూహం
అంశం: చిత్రకవిత
శీర్షిక :కాలానికి కొలమానం మానవ మేథ,,,,,,,,,!!
రచయిత ; అపరాజిత్ రెడ్డి
ఈ అనంత కాలం రెక్కలు తొడిగి
ఇలాగే గతించిపోతుంది కాబోలు
ఈ ప్రభాతాలు ,ఈ సాయం సంధ్యలు
ఉపిరిపోసుకుంటున్న ధరిత్రి పగళ్ళు ,రాత్రుళ్ళు
తేలిపోతున్న మబ్బుల్లా సమస్యల సుడిగుండాలు
కాలం దివారాత్రులు కదలి కదలి కళ్ళు మూసి తెరిచేంతలోనే మటుమాయం,,,,,,,,,,,,,,
ఈ చైత్రాలు ,ఉగాదులు కాలం కొలబద్దలనుకుంటే పొరపాటు,,,,,,,
గ్రహాలను ఏ శిల్పి ఉలితో చెక్కలేదు నిర్దిష్టముగా నీ భవిష్యత్తు రహస్యాలను గణించి చెప్పడానికి,,,,,,,,,,,,,
ఊహలకు అందనిది కాలం పరుగులుపెడుతూ నిన్ను శైశవం నుండి సాకి సాకి ఆవల పారవేస్తూ గిర్రున తిరిగే కాలచక్రం ఈ భువికి,,,,,,,,,,,,,,,,,
వెలుగుల సూరీడు చలిమంటలు రేపుతూ ఋతువుల మార్పుతో కాలం చూసుకునే గడియారం నీకై,,,,,,,,,,,
వినీల గగణం ఆనంతానంత కోటిప్రభల రూపం కింద మానవుడు చరించే భూమి సృష్టికి అతీతమైన శక్తి ఎలా సృజియించబడిందో ఎవ్వరికీ తెలీదు,,,,,,,,,,,,,,,
రాత్రి పూట నక్షత్రాలు ,చంద్రుడు వింత వింత అనుభూతులు ,అనుభవాల ప్రకృతి రమ్యమైన సుందర గోళం భూమి,,,,,,,,,,,,,,
ఆకర్షణీయమైన సముద్రాలు ,పర్వతాలు ,నదీనదాలు, అడవులు చెలరేగే గాలులతో వానలు ,వరదలు ,మండేఎండలు, చలిగాలులు కాలం గర్భంలోకి వెళ్ళినా గుట్టు తెలియదు మానవ మేధకు,,,,,,,,,
ఏది ఆది ?ఏది అంతం!? కాలం ఒక్కటే ఆనంతమైనది .మనిషి జీవితం గుండె లబ్ డబ్ ల మధ్య సాగిపోయే ప్రాణం పోసుకున్న యంత్రం లాంటిది,,,,,,,,,,,
మనిషికి ప్రాణమే చిక్కుతెచ్చిపెట్టింది ఇన్నిన్ని సంపదలు ,వీళ్ళు నావాళ్ళు ,వీళ్ళు పరాయిలు శరీరాల్లో వింత వింత మార్పులు కూడికలు దీనికో గణనం సైన్స్ మొదలగునవన్నీ నీతోపాటు తీసుకుపోలేనివన్నీ దేనికోసం,,!?,,,,,,,,,
జీవిత రహస్యం ,సృష్టి రహస్యం ఛేదించలేనిది కులాలు, మతాలు సైన్స్ ,టెక్నాలజీ మానవులు కంటున్న లెక్కలేనంత మంది పిల్లలు పెరగడం కోసం పెరిగే జనాభా కోసం ఎన్ని తైతక్కలు,,,,,,,,,,,,,,
ఈ భువిపై కొద్దిమంది జనాభా ఉన్నప్పుడు మనిషి ఇన్నిన్ని పోకడలు పోలేదు ఉన్నంతలో తృప్తిగా బ్రతికాడు,,,,,,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట
హామీ పత్రం : ఈ రచన నా కలం సేతయని నా హామీ