కిరణాల కాంతులు

ఈ తొలిపొద్దు సున్నితమైన కిరణాల కాంతులలో , ఏ అలలు లేని ప్రశాంతమైన కోనేరులా మనస్సు అక్షర తపస్వినియై మరిపించే జనజీవనం ప్రభాత స్వరాల జగత్తు. అధ్యయనంలో జ్ఞానేంద్రియాలు సముతుల్యమయ్యే ప్రశాంత ప్రభాతం.వెల్లువెత్తే ఉజ్వల విజ్ఞాన తరంగాలు మనస్సు నుండి ఉద్బవించే ఆలోచనలలో కుశాగ్రబుద్ది అలవడు. గాలి కబుర్ల గందరగోళం దూరమై ప్రవర్తనా శైలి, మాటతీరులో సునిశితత్వం ,మార్దవం అలవడుతుంది. మహోజ్వలమైన విజ్ఞానం చుట్టూరావున్న తెరలు విప్పుకుని మనస్సు గూడులోకి ప్రవేశించి మహామేధావిని చేసే తొలివెలుగుల వేకువజాము.

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *