కురిసే వెన్నెల చల్లదనాలు

నీకై నీవు వెన్నెలలో తారట్లాడ లేనిది అక్షరమెలా పుడుతుంది ?
కన్నీళ్ళు నిండిన హృదయం లోంచే సంవేదనల అక్షరాల వెన్నెలలు,,,,,
వెలిసిపోయిన జీవితాలలోనే అసలు సిసలైన అనుభవాలు మేల్కొలుపు జాగృతి,,,,,
పూవుల్లో అక్షరాల్లో విహరిస్తున్నా మేథస్సు వికసించలేదంటే మూఢునివై ఉండాలి,,,,,
ఈ అపరాత్రి ఎవరూ తొక్కని కంఠకభూయిష్టమైన దారిలో కళ్ళల్లోబాధ గుండెలు కొస్తుంటే ఎందాకోయ్,,,,, ఓ ఆవలి తీరం దాక,,,,,
నింగినిండా నక్షత్రాలు చంద్రుడు ప్రేమల మల్లియలు అల్లుకుపోయిన లతలు మధురమైన క్షణాలు,,,,,,
ఈ వెన్నెలను అక్షరాలలో అల్లుకుపోతుంటే జీవన సోయగాల ఉషస్సు చిందించే వెలుగులు,,,,,,
నా ఒక్కో అక్షరం ఒక్కో నక్షత్రమై వెలుగుల చమక్కులు నీకోసం ఈ కళాతృష్ణ వెన్నెల వర్షం రాత్రుళ్ళు అక్షరీకరణ,,,,,
నీ చీకట్లు ముసిరిన అంధకార బంధురం లాంటి వెన్నెల చల్లదనాలు రువ్వే చంద్రుడికి ఎన్నెన్ని వక్రగతుల కళలో ఈ చింత నీకేల ?
తొలిజాము నుండే తొలిపొద్దు వెలుగులు చిందే కొలది ఆ చంద్రుడు నక్షత్రాలు వెన్నెలలు వివర్ణమై పోతాయి,,,,,
కళ్ళు మూస్తే చీకటి కళ్ళు తెరిస్తే వెలుగుల అక్షరాలు నీ హృదయం నిండా,,,,,,!!

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *