కూలిపోయిన జీవితంలోకి కొత్తసంవత్సరం,,,,,,!!
జీవితంలో మన్వంతరాల దాకా
అగ్నిసముద్రం కెరటాలలో ఈదుతూ
నా అక్షరాల పూవులన్నీ నా చుట్టూర సీతాకోకచిలుకల్లా ఎగురుతూ,,,,,,,,,
కారుచీకట్ల జీవితంలో మెరుపు తీగల్లా జయజయ ద్వానాలు వింటూ,,,,,,,,,
నా ఎదురీత జీవితంలో పూసిన అగ్నిపూవులే నన్ను అందళాలెక్కిస్తున్న బ్రమల్లో ఊగిపోతూ,,,,,,
చేసే బడిపంతులు ఉద్యోగం ఈ వయస్సులో భయానకమవుతూ,,,,,,,
తీయని కలలన్నీ అగ్ని కీలలవుతూ హృదయ సౌందర్యం అవిసిపోయిన శిలాజమవుతూ,,,,,,,
చదివిన చదువులు ప్రయోజనం కోల్పోయిన ఎడారి నాగజెముడు పూవులై వెక్కిరిస్తూ,,,,,,
ఉద్యోగం ఉరిశిక్షకు ముందు గుండెల్ని తోడేసే ఉధృతిలా మరణమృదంగం పాడే దినదిన గండమై,,,,
అలలు అలలుగా పొంగుతూ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుని విద్యార్థుల ముఖాల్లో నవ్వులు పూయిస్తూ సాగే జీవిత పోరాటం విధి లిఖితం,,,,,,,,,,
అక్షరాలు రాయడానికి అలవాటు పడ్డ చేయి ఉరుకోక నా కన్నీళ్ళ జీవితం కవితలై కలలై కళలై కవితా సుధలై నీతో పాలుపంచుకుంటూ,,,,
ఈ చివరి దినం ఈ సంవత్సరం ఇంతకన్నా ఏం రంగుల హరివిల్లులు కోరుకుంటుంది నూతన సంవత్సరం,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట