కె. వి. కృష్ణకుమారి తెలుగు రచయిత్రి, సాహితీవేత్త, గైనకాలజిస్టు. ఆమె కృష్ణక్కగా సుప్రసిద్ధురాలు. ఆమె తన తండ్రి గారి పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎన్నో సేవలని ఎంతో మందికి అందిస్తుంది.
ఆమె తెనాలిలో కాజా వెంకట జగన్నాథరావు, సత్యవతి దంపతులకు జన్మించింది. కృష్ణక్కకు ముగ్గురు తమ్ముళ్ళు నలుగురు చెల్లెళ్ళు అందరు ఉన్నత స్థానములో సెటిల్ అయ్యారు. కృష్ణక్క ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యవరకు తెనాలి లోనే అభ్యసించింది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను (ఎం.బి.బి.ఎస్) అభ్యసించింది. ఆమె హైదరాబాదులో నివాసం ఉంటున్నది. ఆమె వృత్తి మెడికల్ ప్రాక్టీషనర్ అయినా ప్రవృత్తి మాత్రం రచనా వ్యాసంగమే. ఆమె ‘రమ్యకథా కవయిత్రి’ గా పేరు పొందినది. ఆమె తన పది సంవత్సరాల వయసులో ‘భలే పెళ్ళి’ నాటకంతో రచనా వ్యాసాంగం ప్రారంభించింది.మానసిక స్థైర్యం కోల్పో యిన వారికి కృష్ణక్క సలహాలు, సూచనలు ఎందరికో మార్గదర్శనమయ్యాయి.
కృష్ణకుమారి తన పదేళ్ళ వయసులో తెనాలి బ్రాంచి హైస్కూల్లో చదువుతున్న సమయంలో విద్యార్థుల ప్రదర్శన కోసం ‘భలే పెళ్ళి’ నాటకం రాసింది. 1970 ప్రాంతంలో ప్రముఖ మాసపత్రిక ‘మహిళ’ తిరుపతి నుండి వెలువడేది. రాయలసీమ సేవా సమితి సెక్రెటరీ డా. మునిరత్నం నాయుడుగారు, పద్మారత్నంగారూ, ఆ పత్రికకు సారథ్యం వహించేవారు. ఆ పత్రికలో యద్దనపూడి సులోచనారాణితో కలసి పోటాపోటీగా సీరియల్స్ వ్రాసేదామె. ‘కృష్ణక్క సలహాలు’ అనే శీర్షిక ద్వారా పాఠకులకు ఆమెను పరిచయం చేసింది ఆ పత్రికే. దాదాపు నలభై సంవత్సరాల పాటుగా వివిధ ప్రముఖ పత్రికలలో, ‘కృష్ణక్క సలహాలు’ శీర్షికను నిర్వహిస్తూ కృష్ణక్కగా లక్షలాది మంది హృదయాలలో స్దిరస్థానం సొంతం చేసుకున్నదామె.
సమాజ హితమే తన హితంగా భావించే కృష్ణకుమారి ఐదు దశాబ్దాలకు పైగా రచయిత్రిగా చిరస్మరణీయమైన గ్రంథాలు వెలువరించింది. నవలా రచయిత్రిగానే కాకుండా జీవిత కథలను అందించడంలో కూడా ఆమె సిద్ధహస్తురాలు. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుకు ఆత్మీయురాలు, కుటుంబ సభ్యురాలు. ఆయన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ కృష్ణకుమారి రాసిన “మనిషిలో మనీషి” అన్న గ్రంథం ఇప్పటికీ బహుళ ప్రజాదరణ పొందింది. అలాగే పుట్టపర్తి సాయిబాబా మీద రాసినటువంటి “అద్వైతామృత వర్షిణి” అన్న గ్రంథం కూడా భక్తులు అమితంగా ఇష్టపడతారు.
ఇప్పటిదాకా వైద్యరంగంలో తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ లోను, గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లోను, హైదరాబాద్ కింగ్ కోటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లోను ప్రభుత్వ వైద్యురాలిగా సేవలు అందించి పదవీ విరమణ చేసారు. ఆధ్యాత్మిక పరంగా, ఆదేశాత్మకంగా 60కి పైగా నవలలు వ్రాసింది. “సహిత జావిత వజ్రోత్సవ” వేడుకలను అభిమానులు జరుపుకున్నారు. భగవాన్ సత్యసాయి బాబా కృష్ణక్క త్యాగ నిరతికి మెచ్చి “ఓంకార” పతకమున్న సువర్ణమాలను స్వయంగా మెడలో అలంకరించారు. అతని ఆదేశాలనుసారం అద్వైతామృత వర్షిణి, ‘భద్రాకళ్యాణం’ ప్రబంధ గ్రంథం వ్రాసింది.
“ఆరోగ్యప్రదాయి శ్రీ సత్యసాయి” అనే ఆధ్యాత్మిక శీర్షిక దాదాపు 40 నెలలపాటు ధారావాహికముగా సనాతన సారథిలో వెలువడింది. ఇది గ్రంథ రూపములో రాబోతుంది. అలాగే శ్రీవాణి ఆధ్యాత్మిక మాసపత్రికలో “భగవాన్ ఉవాచ” అనే ఆధ్యాత్మిక శీర్షిక ఎన్నో సంవత్సరాలు వెలువడింది.
రాజకీయ నేపథ్యం ఆమెకు దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులుగారు, మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి రక్త సంభంధీకులైన దగ్గర బంధువులు. మెడిసిన్ లో, కుటుంబపరంగా, కొండా వెంకటప్పయ్య గారి మెరిట్, స్కాలర్షిప్ ను అందుకున్నది. మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం|టంగుటూరి ప్రకాశం పంతులు గారు కృష్ణకుమారి కుటుంబానికి అత్యంత ఆత్మీయులు. భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారి అభిమాన పుత్రికగా, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి ఇంటి ఆడపడుచుగా సుప్రసిద్దురాలు.
రచనలు
కర్మయోగి
భద్రాకళ్యాణం
మనిషిలో మనీషి డాక్టర్ అక్కినేని
మంచుపూలు
శ్రీ కృష్ణామృతం
సశేషం.
2004 జూలైలో ప్రతిష్ఠాత్మక “దుర్గాబాయి దేశ్ ముఖ్” అవార్డు శ్రీమతి వి.ఎస్. రమాదేవి (మాజీ గవర్నర్ కర్ణాటక) నుండి స్వీకారం
2004 సెప్టెంబరులో టి.ఎస్.ఆర్. అవార్డు రవీంద్ర భారతిలో ప్రదానం.
1974 తెనాలి శారదా కళా పీఠంలో అంతర్జాతీయ మహిళా సంవర్గములో వివిధ సాహితీ సంస్థల చే “రమ్య కధా కవయిత్రి” “అభ్యుదయ నవలా రచయిత్రి “బిరుదులు ప్రధానం
1975 లో మహా కవి శ్రీ శ్రీతో అంతర్జాతీయ రచయితల సదస్సుకు ఆహ్వానం అందుకున్నారు
1983 లో తానా వారిచే అమెరికాకు ఆహ్వానం.వాషింగ్టన్ లో మస్కులర్ డిస్త్రోఫీ అన్న అంశము పై వైద్యపరముగా పేపర్ సమర్పించటం.
కృష్ణక్క గారి పదవులు
వైద్యుల లోని సృజనాత్మక శక్తినీ లలిత కళల తాలూకు ప్రతిభాపాటవాలనువెలికి తీసే నేపథ్యంలోఏర్పడిన “స్పందన” సాంస్కృతిక సంస్థలకి వ్యవస్థాపక అధ్యక్షులు (1985)
ఆంధ్రప్రదేశ్ మహిలాభ్యుదయ సమితి అధ్యక్షురాలిగా ఎంపిక (1991)
ప్రతిష్ఠాత్మక సాహితీ సాంస్కృతిక మహిళా సంస్థ “అభినందన “కు అధ్యక్షురాలిగా ఎకగ్రీవముగా ఎన్నిక (1992)
విశ్వభారతి అకాడమీ సర్ సి.వి. రామన్ ఎడ్యుకేషనల్ అవార్డు కమిటీకి చైర్ పర్సన్ గా ఎంపిక (1995)
శ్రీ సాయి సేవా సొసైటీ స్వచ్ఛంద ధార్మిక సంస్థలకి అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా నియామకం (1995)
”డాక్టర్ కాజా వెంకట జగన్నాధరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆవిర్భావం చైర్ పర్సన్”గా ఏకగ్రీవముగా ఎన్నిక (1995)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే “నంది అవార్డు కమిటీ సభ్యురాలి”గా ( 1994-1995 ) నియామకం
ఇంట్రాడ్ సునేత్ర అంధుల పాఠశాలలకు చైర్మన్ గా ఏకగ్రీవముగా ఎన్నిక (1999 august).
మాధవి కాళ్ల
సేకరణ