కొత్త ఎప్పుడూ కొత్తే

అక్షర కొరకు
అంశం – కొత్త సంవత్సరం
రచన – ఉమాదేవి ఎర్రం

శీర్షిక – కొత్త ఎప్పుడూ కొత్తే

కొత్త సంవత్సరం వస్తుందని
కొత్త ఉత్సాహం రావాలనీ
కోరుకుంటాం కానీ తీరా ఆ
కొత్త వచ్చాక పాతగానే చూస్తాం!

అయితే పాతనే బంగారం కదా
ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా దూరపు
కొండలు నునుపు లాగా వచ్చే
వరకే ఆతృత వచ్చాక ఒకటే తీరు!

ఏదేమైనా వస్తుందంటే మాత్రం
ఏవో ఒక నిర్ణయాలు తీసుకుని
జీవితంలో కొత్త పరుగులు పెట్టాలి
అవి ఏవైనా నూతనోత్సాహం రావాలి!

తీసుకున్న సంకల్పాలు నెరవేరాలి
నెర వేర్చుకోవాలి ఉన్న బాధలు
తొలగాలి కొత్త కోరికలు కలగాలి
అవి నెరవేరే మంచి తీర్మానం ఇవ్వాలి!

ఆశల చిట్టా అమలు కావాలని
కోరికల గుర్రాలు పరిగెత్తాలని
కాలాన్ని కోరుకుంటూ కొత్త వత్సరం
కోసం ఎదురు చూస్తున్నా!

నా డైరీ పుటల్లో రాసుకుంటున్నా
కలలు నిజం కావాలనీ కాలానికి
మరోసారి విన్నపం చేస్తున్నా కొత్త
కోసం కొత్త కొత్తగా నిరీక్షిస్తున్నా!

ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *