ఎంత బాధలో ఉన్నా
కొన్ని బంధాలు
మరికొన్ని బంధుత్వాలు
ఇంకొన్ని బాధ్యతలు తప్పవు
జీవితంలో జీవించడం
అంటే బాధ్యతలన్నీ
భరించడమే తప్పుించు
కోవాలనుకుంటే తప్పేలా
లేవు!
ఈ బాధ్యతలు పట్టించు
కునే వారికే ఉంటాయి
ఏమీ పట్టించుకోని వారికి
ఏమీ ఉండవు!
కొందరు పుణ్యాత్ములు
తొందరగా చనిపోయి
వారి బరువు తప్పించు
కుంటారు ఇంకొందరు
భారంగా బ్రతుకీడుస్తారు!
-ఉమాదేవి ఎర్రం..