కోల్పోయిన మనిషి బూడిద

అక్షర కొరకు
అంశం :⁠- చిత్ర కథ
తేది:⁠- 06/12/2025
శీర్షిక:⁠- కోల్పోయిన మనిషి బూడిద

                                  రామచంద్రయ్య గారు మీకు పార్సిల్ వచ్చింది అని పోస్ట్మాన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. 
                                  విప్పి చూస్తే...

ప్రియమైన తండ్రికి…

                               మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయినందుకు క్షమించండి కానీ అమ్మలేని ఆ ఇంట్లో ఉండలేక ఇలా దూరంగా వచ్చేసాను. 
                   
                     తర్వాత    మిమ్మల్ని కలవడానికి వస్తాను రానో తెలీదు కానీ ఈ ఉత్తరం మాత్రం నా గుర్తుగా మీకు ఉంటుందన్న ఆనందమే ఎక్కువ. 

ఒక అపరిచితుడు అయినా వ్యక్తితో స్నేహం కుదిరింది ఆ వ్యక్తితో కలిసి ఒక బిజినెస్ పెట్టాను.
ఆ బిజినెస్ ఇప్పుడు సవ్యంగా నడుస్తుంది కానీ నేను అక్కడే ఉంటానని మీకు చెప్పలేను ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణమైనా నేను అక్కడి నుండి వెళ్ళిపోవచ్చు మీరు నన్ను చూడాలి అనుకుంటే ఈ కిందున్న నెంబర్ కి ఫోన్ చేయగలరు అని ఉంది.

ఆ ఉత్తరం చదివిన రామచంద్రయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ…
నువ్వు ఇంటి నుంచి వెళ్లిపోవడానికి కారణం నేనే అని అనుకుంటూ గోడమీద ఉన్న వాళ్ళ కుటుంబ ఫోటో చూసి అలా గతంలోకి వెళ్లిపోయాడు.
రామచంద్రయ్యకు సుశీలకు ఒకే ఒక కొడుకు అతనే సూర్య. బాగా చదువుకున్న వ్యక్తి కానీ ఉద్యోగం మాత్రం చేయలేను ఇంకేదో చేయాలి అని ఆరాటంతో ఏదో ఒక అన్వేషణలో ఉండేవాడు.
రామచంద్రయ్య స్నేహితులు కొంతమంది సూర్య అలా ఉండడం చూసి ,
“ఎందుకు నీ కొడుకుని అలా వదిలేస్తున్నావు? ఎందుకు భయపెట్టట్లేదు? ఎందుకు సర్ది చెప్పట్లేదు?” అని అంటూ ఉంటే భరించలేక , సూర్య మీద అరుస్తూనే ఉండేవారు రామచంద్రయ్య. అదే సమయంలో సుశీల అన్న గారి కూతురు పెళ్లి ఉందనగా వెళ్లారు. ఆ పెళ్ళిలో కూడా కొంతమంది రామచంద్రయ్యను సూర్యని ఏం చేస్తున్నావు అని అడిగితే…
సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉండడం చూసి తట్టుకోలేక కోపంతో రగిలిపోయాడు రామచంద్రయ్య. ఇంటికి వెళ్తున్న సమయంలో రామచంద్రయ్య దారి పొడుగునా సూర్యుని తిడుతూనే ఉన్నాడు. అదే సమయంలో సడన్గా ఒక లారీ వచ్చి రామచంద్రయ్య వాళ్ళు వెళుతున్న కారు ఢీకొన్నది. ఆ యాక్సిడెంట్ లో సూర్యకి సుశీల కి తీవ్ర గాయాలయ్యాయి ఇద్దరి పరిస్థితి విషంగా ఉందని డాక్టర్లు చెప్పగానే… రామచంద్రయ్యలో భయం అలజడి నెలకొన్నాయి. ఇద్దరూ ప్రాణాలతో పోరాడి పోరాడి సుశీల వాళ్లకి దూరమైంది సూర్యకి మెలకువ వచ్చింది.
తన తల్లి చనిపోయిందని తెలియగానే… సూర్య కృంగిపోయాడు. తండ్రితో మాట్లాడడం పూర్తిగా మానేశాడు అదే మౌనంతో ఒకరోజు చెప్పకుండా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న రామచంద్రయ్య వెంటనే తనకు తెలిసిన వాళ్ళ చేత సూర్య గురించి అడగడం తెలుసుకోవడం చేశాడు కానీ ఎక్కడ జాడ దొరకలేదు? ఈ ఆరు నెలల తర్వాత ఈ ఉత్తరం రావడంతో ఆశ్చర్యపోయాడు రామచంద్రయ్య.
ఆ మరుక్షణమే ఎవరో తలుపు కొట్టడంతో గతం నుంచి బయటికి వచ్చి ,
“అంకుల్! సూర్య అన్నయ్య ఫోన్ చేశారు , ఇదిగోండి! మాట్లాడండి” అని ఎదురింటి అబ్బాయి ఇచ్చాడు ఫోన్.
అవతల నుంచి సూర్య మాటలు వినిపిస్తున్న మౌనంగా వింటున్నాడే కానీ సమాధానం చెప్పలేకపోతున్నాడు దారాళంగా కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి రామచంద్రయ్యకు.
చివరకు ఇద్దరు మాట్లాడుకున్నారు ఆ తర్వాత తన స్నేహితుడి ద్వారా సూర్య ఎక్కడున్నాడు అని వారం రోజుల తర్వాత తెలుసుకుని అక్కడికి ప్రయాణమయ్యాడు రామచంద్రయ్య.
అది దీపావళికి కాల్చే మతాబులు తయారు చేసే ఫ్యాక్టరీ వాళ్ళు ప్రారంభించి మూడు నెలలే అయినా ఎంతో పేరు పొందింది ఆ ఫ్యాక్టరీ. ఇంత సడన్గా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరగడంతో అందులో ఐదుగురు కార్మికులు ఒక యజమాని చనిపోయారని తెలిసింది.
ఆ మంటలను ఆర్పడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది.
అలా మూడు గంటలు గడిచిపోయింది కానీ అందులో కాలిపోయిన వాళ్ళ బుడితే మిగిలింది కానీ బూడిదే మిగిలింది కానీ మనుషులు మాత్రం ఊపిరితో లేరు.
అక్కడికి సడన్ గా ఒక పెద్దాయన వచ్చి నా కొడుకు లోపల ఉన్నాడు ఇప్పుడు ఆయన అతనికి ఎలా ఉంది హాస్పిటల్కి తీసుకెళ్ళారా అని కంగారుగా అడుగుతూ ఉంటే…
అంకుల్ సూర్య చనిపోయాడు అని చెప్పాడు సూర్య స్నేహితుడు శంకర్.
అయితే సగం కాలిపోయి ఉన్నా ఆ ఫ్యాక్టరీలోకి వద్దు అంటున్న వెళ్తాడు రామచంద్రయ్య.
ఎంతో హడావిడిగా ఏదో మీటింగ్ ఉందనుకొని తన కాబిన్ లో కూర్చొని లాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉండడం ఆ తర్వాత సడన్గా నిప్పులు అంటుకోవడం జరిగాయి.
మెల్లగా ఒక్కొక్క గది చూసుకుంటూ వెళుతూ ఉండగా ఒక క్యాబిన్లో నల్లటి ఒక ఆకారం కుర్చీలో కూర్చున్నట్టు ఉంది.
అది చూసి వెంటనే కన్నీళ్లు పెట్టుకుంటూ దగ్గరికి వెళ్లి ముట్టుకోగానే మెల్లగా అది బూడిదగా మారిపోయింది.
తన కొడుకుని సజీవంగా చూసుకోలేకపోయినా కోల్పోయిన మనిషి బూడిదగా మారిన కొడుకుని చూసి అక్కడే కుప్పకూలిపోయాడు రామచంద్రయ్య.
నాలుగు రోజుల తర్వాత సూర్య అంత్యక్రియలు పూర్తి చేసేసి శంకర్ తోపాటే తను కూడా ఉన్నాడు రామచంద్రయ్య.
తన కొడుకుతో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉన్నాడు.

మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                      ఈ కథ నా సొంతం అని హామీ ఇస్తున్నాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *