manassu tanadi kaakapothe

క్షమించరాని కోపం

అక్షర కొరకు
అంశం – అసూయా ద్వేషంతో ఉన్నవారు మీ జీవితంలో
తారస పడినప్పుడు మీరు పడే బాధ
రచన – ఉమాదేవి ఎర్రం..

శీర్షిక – క్షమించరాని కోపం – ఏమీ చేయలేని నిస్సహాయత

అసూయ ద్వేషాలు ఉన్న వారు
నా జీవితంలో తారసపడితే కాదు
పడ్డారు క్షమించరాని తప్పులు
చేస్తూ కుటుంబ సభ్యలయ్యారు!

వారు కుటుంబంలో చేరడం వలన
కుటుంబమే చిన్నాభిన్నం అయింది
అయినా వారిని ఏమీ చేయలేని
నిస్సహాయత అన్నీ ఋజువులున్నా!

జీవిత ప్రయాణం లో కఠినాత్ములు
పాపాత్ములు తగులుతునే ఉంటారు
వారి స్నేహం పదిచ్చి వదులు కోవచ్చు
కానీ కుటుంబంలోనే ఉంటే ఏం చేయాలి?

దేవుడి మీద భారం వేసి వారి కర్మకు
వారిని వదిలేయాలా? ఋజువులు
చూపించి న్యాయం కోసం పోరాడాలా?
నేనైతే దేవుడికే వదిలేస్తున్నా!

మరి మీరేం చేయమంటారు?
కర్మ లేమీ ఉండవు నలుగురిలో
అవమానించ మంటారా? లేక
నా లాగే కాలానికే వదిలేయ మంటారా?

అసూయతో రగిలే ప్రాణాలను
అసూయే కాల్చేస్తుంది ( అనసూయ కాదు )
అసూయ ద్వేషం కూడా కాల్చి మసి బొగ్గు
చేస్తుంది వాళ్ళను అంతే!

ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *