అక్షర కొరకు
అంశం – గణతంత్రము
రచన – ఉమాదేవి ఎర్రం
శీర్షిక – స్వతంత్ర వాయువు
స్వాతంత్రం కోసం
ఎందరో నాయకుల పోరాటం
స్వతంత్రం వచ్చాక
గణతంత్రం జరిగింది!
బ్రిటీష్ వారి దగ్గర
బానిసల బ్రతుకు నుండి
విముక్తి ప్రసాదించిన
నాయకులెందరో!
వీర మరణం చెంది వారు
ఇచ్చారు స్వేఛ్చ మనకు
అనాది బానిస బ్రతుకుల
నుండి స్వేఛ్చా వాయువు పొందాం!
లెక్కలన్నీ లెక్క కట్టి
గణతంత్రం రోజు పెట్టి
జాతీయ గీతంతో మన
జాతి పతాకం ఎగురవేసె!
అసలైన స్వాతంత్రంతో
ప్రజలంతా గాలి పీల్చే
సుభాష్ చంద్రబోస్ లాంటి
మహనీయులెందరో పోరాడి
బంధించిన గాలిని విడిపించే!
ఇది నా స్వీయ రచన..