అక్షర కొరకు
అంశం :- రిపబ్లిక్ డే
తేది:- 23/01/2026
శీర్షిక:- గణతంత్ర వీరులం..
జాతికి పండుగ గణతంత్ర తేజముతో
వెలిగెను భారత పతాక
మువ్వన్నెల రెపరెపలు
చాటెను వీరుల త్యాగము
అమరుల ప్రాణ బలిదానం ఆదర్శ మార్గము
రాజ్యాంగ నిర్మాణం జరిగెను
మహా బలిదానముతో
ప్రజాస్వామ్యపు మూలపునాది
కఠిన నియమాలతో
సమానత్వపు సిద్ధాంతము
ప్రతి పౌరుని హక్కులతో
స్వేచ్ఛా స్వాతంత్ర్యాల విలువ
మనకు దక్కిన ఉక్కు
ఢిల్లీ వీధుల్లో కవాతు
సాగెను ధైర్య శౌర్యాలతో
త్రివర్ణ పతాకం రెపరెపలాడెను
నింగి కెగురుతున్నా వేళ
వివిధ రాష్ట్రాల సంస్కృతులు ఒకటైన వేళ
ఐకమత్యపు సందేశము చాటెను విజయ కేళ
సైనిక వీరుల శౌర్య పరాక్రమాలు వందనం
దేశ రక్షణలో వారి త్యాగాలు చూడ మున్నెన్నడు
ప్రతిజ్ఞ చేద్దాం ఈ రోజు దేశం కోసమే
ప్రజాస్వామ్యపు విలువలు కాపాడాలి మనమే
కుల మత భేదాలు లేని భారత ధాత్రి
ప్రతి బిడ్డకు దక్కాలి సమాన అవకాశము
దేశ భవిష్యత్తు కోసం మన కర్తవ్యము
గణతంత్ర వీరులం మనం గౌరవించాలి రాజ్యాంగము
ప్రపంచ దేశాలకు ఆదర్శం మన భరత భూమి
జయహో జయహో భారత్ అని నినదించెదము
జై హింద్ నినాదముతో ఉద్వేగము చెందెదము
మాధవి కాళ్ల..
హామీ పత్రం :-
ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను