గుండెలను పిండేసే మనోవ్యాకులత కూడదు,,,,,,!
ఓ సొగసు పూల ఇంద్రజ
ఏమిటి నీ చింత ? జాబిలి కూన
అహరహం శ్రమించిన దేదైనా ఫలించలేదా !?
మనస్సు గూడు ఎంత వద్దనుకున్నా మాటవినట్లేదా ?
ఆలోచనలతో సమరంలో అదుపుదప్పావా మనోహరి
సమస్యల పరిష్కారంలో మనస్సును అదేపనిగా తిరుగతోడకూడదు,,,,,,
సరియైన మెళకువలతో సమస్యలను ఛేదించాలి,,,,,
ప్రేమ వైఫల్యం మనస్సును కకావికలం చేస్తుంది బేల
నిన్ను నిన్నుగా గుర్తించని వాళ్ళతో ప్రేమలు తగదు,,,,,
ఉడుకు రక్తంలో మనస్సుకు చిన్న గాయమైనా తీవ్రమైన వ్యాకులత సహజం,,,,,,,
భయపడకు ఉరిమే మేఘాలన్నీ వర్షించవు
ప్రేమ వైఫల్యమే అయితే చూడు నీ చూట్టూర ఉన్న ప్రపంచంలో చాలా మంది యువతులు ప్రేమలు పెళ్ళిదాకా రాక ఊరడిల్లి ఓ మంచి మనిషిని మనువాడుతున్నారు,,,,,,,
పూచిన పూవులన్నీ పడతుల జడలలో ఒదిగిపో నవసరం లేదు చాలా పూవులు అందాలు చిందిస్తూ ఆరాద్యుల హృదయాల్లో ఆహ్లాదం గొల్పుతున్నాయి,,,,,
ఈ ప్రపంచం నిండా మనుషులు బండరాతి విగ్రహాలు నీవు గాజుబొమ్మవైతే ముక్కలు
వక్కలు చేస్తారు జాగ్రత్తరా జాబిలి కూన,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట