గెలుపు బావుటా

అక్షర సమూహం
అంశం : నేటి పిల్లలు—సామాజిక బాధ్యత
శీర్షిక :గెలుపు బావుటా,,,,,,!
రచయిత అపరాజిత్ రెడ్డి

నైతిక విలువలు కడగంటిన జీవితం
జీవించినా ఒకటే మరణించినా ఒకటే!
విరిసిన పూలను నలిపేసే వాడు
రాక్షస జీవనం గడిపే చండాలుడు!
మనిషి మనస్సును గాయపరిచే నీచుడు
రాతి గుండెల్లో కల్మషం నిండిన మృగం!
చాలీ చాలని బ్రతుకు బ్రతికే నిరుపేదలు
నోటికాడి బువ్వ లాక్కునే వాడు ఊరబలిసిన ఆంబోతు!
చదువుల తల్లి దీవెనలతో విద్యనార్జించే విద్యార్థి
కార్పొరేటు చదువులకు ధీటుగా నైపుణ్యంతో గట్టెక్కినా
నీది మాతృభాష చదువు ఉద్యోగానికి పనికిరావు
అంటూ త్రోసిపుచ్చే బడాబాబుల దాష్టికం
అది చెల్లదంటూ చెంప చెల్లుమనిపించేలా
సవతి తల్లి ఆంగ్లాన్ని ఆశ్చర్యపోయేలా మాట్లాడి గెలిచిన విద్యార్థి
బ్రతుకు బాటలో మాతృ వర్గీయులకు ఆదర్శం!
జీవిత వీణాతంత్రులు తెగి మూగబోయినా
నిరాశ నిస్పృహలకు తావివ్వక పోరాడి గెలవడమే నీ విద్యకు విలువ!
నక్కజిత్తుల నాగరికుల కుయుక్తులకు దూరంగా
వేల వేల నక్షత్రాల కాంతిని నీ కళ్ళల్లో నింపుకుని
చదివిన పుస్తకాల జ్ఞానాన్ని విజయాలతో ముందుకు సాగడమే నీ విధి
వికృత మనస్కులు అంధకారంలోనే తమ గొయ్యి తామే తొవ్వుకుంటారు!
ఒకరి కింద బ్రతుకులు ఉద్యోగాలు
అందుకే హృదయం ప్రోధి చేసుకుని
నీకై నీవే విజ్ఞాన వెలుగుల్లో పదిమందికి ఉపాది కల్పించు!!

అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం ఈ రచన నా కలం సేతయని నా హామీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *