గ్యాస్ కొరత

గ్యాస్ లేకుండా బతకలేమా కరోనా వస్తే బ్రతికామ్ కదా ఇది అంతే ఏదైనా కొన్ని రోజులే,ఇది కూడా మంచికే అన్నీ అవసరాల విలువను తెలుపుతుంది.ఆనాటి జ్ఞాపకాలను నిద్రలేపుతుంది.బంధాల, బాధ్యతలు,బాల్య గుర్తులని అమ్మ పడే కష్టాన్ని,ఆ పొగ వెళ్ళి ఊపిరితిత్తుల్లో చేరి కష్టాలు పడిన వారిని గుర్తొస్తాయ్, వేప చెట్టు నీడలో అమ్మ వండుతున్న అన్నం ఉడుకుతున్న ఘుమఘుమలు, కూర పొయ్యి పై వేసి ఇంట్లో మిగతా పనులు చేస్తూ కనిపించే రోజులను, చలి కాలంలో చలి కాచుకోవడం కోసం పొయ్యి చుట్టూ కూర్చుని అమ్మ పెట్టే డికాక్షన్ మారగుతుంటే ఆ వాసన పీల్చే రోజులని, వాన కాలంలో ఉల్లిపాయ పులుసు నల్లని చింతపండు తో వేడిగా వండినా ముద్దయ్యే రేషన్ అన్నంలో ఆ పులుసు వేసుకొని తిని ఆ రుచి చేతి చిటికెన వేలుతో సహా నాకుతూ,ఆ పులుసు లో వాడిన ఘాటు కు ముక్కులోంచి కారుతున్నా పట్టించుకోకుండా అమ్మ అన్నం అని అడిగిన రోజులని మర్చిపోగలమా? ఇప్పుడు మళ్ళీ ఆవే రోజులు రాబోతున్నాయా? వస్తే రాని మంచిదే ఎలక్ట్రికల్ స్టవ్ లో అనారోగ్య సమస్య తెచ్చుకోకుండా హాయిగా మళ్ళీ ఆ కట్టెల పొయ్యిలు అవి అమ్మే లంబాడి వారిని చూస్తామా? చూస్తే బాగానే ఉంటుంది. కానీ అసలు అవన్నీ తెలియని ఈ తరానికి ఇవన్నీ చేయడం కుదురుతుందా? అది పట్టణం నమ్ముకుని ఉన్న ఊర్లో ఇల్లు అమ్మేసుకుని పొట్ట చేత బట్టుకుని వచ్చిన వారికీ ఒక్క పని దొరక్క మళ్ళీ ఆందరూ పల్లెటూరు వెళ్ళిపోతారా? అలా వెళ్ళి ఉండగలరా? కరోనా అప్పుడే చాలా మంది వెళ్లిపోయారు ఇప్పుడు కూడా అలాగే అవుతుందా? ఈ తరానికి కట్టెల విలువ తెలుస్తుందా? ప్రకృతి విలువ, అవసరాలు, అనవసరాలు, అసలు మండి కి అలవాటు పడిన వారికీ కట్టెల పొయ్యి మంట పెడుతుందా? చూద్దాం ఏమవుతుందో???

-భవ్యర్చన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *