tallidandrulu chala nerchukovali

చమత్కారం అంటే ఏమిటి?

చమత్కారం అంటే ఏమిటి?

ఓ విషయం చెబితే
” ఇదేమిటి, అదెలా, అలా ఎలా “
అని ఉత్సుకత కలిగించాలి. దీనిలో ఏదైనా మతలబు ఉందా అనిపించాలి. అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలనే ఆతృత కలిగించాలి. విషయం అలా చెప్పడం చమత్కారం అంటారు.

ఓ గ్రామం లో సర్వమంగళశాస్త్రి గారని ఓ వేదపండితుడు ఉండేవారు. వారి మనుమడికి ఉపనయనం చేస్తూ ఆహ్వానపత్రికలో

” మా మనుమడి ఉపనయనానికి మీరందరూ విచ్చేసి వటువుని ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళవలెను.
భోజనాల తరువాత నా ఉపనయన కార్యక్రమాన్ని కూడా వీక్షించి వెళ్ళవలసినదిగా కోరుకుంటున్నాను “

అని వ్రాసారు;

అందరికీ ఆశ్చర్యం వేసింది —
మనుమడికి వడుగు
వరకు సరే,
ఈయనకు మళ్ళీ
వడుగు ఏమిటీ అని.

సరే ఈ విషయం తెలుసుకోవాలనే ఆసక్తితో మొత్తం బంధువులందరూ వచ్చేసారు. భోజనాలయాయి. శాస్త్రిగారు కుర్చీలో కూర్చున్నారు, బంధువులు, అతిధులు ఎదర చాపలమీద ఆశీనులయారు.

శాస్త్రిగారి భార్య ఓ చిన్న అందమైన పెట్టె తెచ్చి శాస్త్రిగారికి ఇచ్చారు. ఆయన ఆ పెట్టె మెల్లిగా తెరచి అందులోనుంచి ఓ కళ్ళజోడు తీసారు.

అందరికీ చూపెట్టి ” నాకు చత్వారం వచ్చింది.
ఈ మధ్యనే, డాక్టర్ గారు ఈ కళ్ళజోడు పెట్టుకోమన్నారు. ఈరోజు ముహూర్తం బాగుందని పెట్టుకుంటున్నాను. మీరందరూ నా ఈ ఉప_నయనం ( నయనం అంటే కన్ను, ఉప అంటే దగ్గరగా ఉండేది ) కార్యక్రమం కూడా చూసి వెడుతూన్నందుకు ధన్యవాదాలు ” అని అది పెట్టుకున్నారు.

లేచామా,
తిన్నామా,
టీవీ ఫోన్ చూసినామా, పడుకున్నామా అనికాకుండా ప్రతీ పనిలోనూ హాస్యాన్ని ఆస్వాదించాలి.🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂😂😂
ఇట్లు
మీ
కోటేశ్వరరావు ఉప్పాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *