చిత్ర కవితా పోటీమహమ్మద్ రవూఫోద్దీన్≠===========స్త్రీ (సిరి)

జననం నుండి మరణం వరకు
ఉయ్యాల నుండి పాడే వరకు
తల్లిగా చెల్లిగా
కూతురుగా భార్యగా
లాలిత్యం మాతృత్వం
మిత్రత్వం ప్రేమతత్వం
రూపం ఏదైనా
జీవన అర్థం
మానవ జన్మ పరమార్థం

నేర్పు ఓర్పు
సంసార కూర్పు
బాంధవ్య సఖ్యతమూర్తి
సకల సౌఖ్యాల త్యాగమూర్తి

దైవ సృష్టిలో
ఉత్కృష్టం
తల్లి గర్భంలోనే
ఆమె శ్వాసను శాసించే
ఓ!మనిషి నీ ఆలోచన నికృష్టం

ఇది నా స్వీయ రచన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *