చెలీ

అక్షర సంక్రాతి ప్రేమ లేఖ పోటీ కొరకు

చెలీ ! నా నెచ్చెలీ!
ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు?
నువ్వు లేనిదే నేను లేను ఈ రోజు
నా కోసం ఎంతో చేసావు అను దినము ప్రతిక్షణం నిన్ను తలుచుకుంటూనే ఉంటా!
మరి నీకు నేను గుర్తున్నానా? ఉండే ఉంటానులే! నీ హృదయం లో నా స్థానం అలాంటిది మరి నన్నెలా మర్చిపోతావు?
నువ్వు మరవాలన్నా నేనెందుకు మరవనిస్తా!
మనం కలిసి ఉన్న రోజులు ఎంత బాగుండేవి అసలు తలుచుకుంటేనే ఆ రోజుల్లోకి వెళ్లి పోవాలనిపిస్తుంది కదూ!
మల్లె తోటలో ఆటలు మామిడి చెట్టుకు కట్టిన ఉయ్యాలలో ఊగడం ఎంత సరదాగా ఉండేది..
వెన్నెల్లో కూచుని అమ్మ పెట్టిన భోజనం తింటూ చందమామతో
చెప్పిన కబుర్లు గుర్తున్నాయా?
మా తమ్ముడు తెచ్చుకున్న మామిడి పండ్లు మనం కొట్టేసి తిన్న రోజులు వాడు అలిగిన తీరు ఎంత బాగా ఎంజాయ్ చేసాం కదా! ఇప్పటి వాల్లకు ఆ తీపి గుర్తులే లేవు కదా!
ఇసుక దిబ్బ లో పిట్ట గూళ్లూ బొమ్మరిల్లులు కట్టుకున్న జ్ఞాపకాలు ఎన్నని చెప్పను ఏమని చెప్పను?
రావే వసూ మనం ఒకసారి కలుసుకుందాం! ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత నువ్వెలా ఉన్నావో? నేనెలా ఉన్నానో ? చూసుకుందాం! రావే మరి..

           నన్ను మరవ లేదనుకుంటున్న నీ ఉమని....

ఉమాదేవి ఎర్రం..
ఈ లేఖ నా స్వంతం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *