జండా

అమ్మ నాన్నల పై ఇష్టం
ఊరి పైన మమకారం
రాష్ట్రం,దేశం పై అభిమానం
బాల్యంపై ఆపేక్ష
ఈ మట్టి,నీరు ఆకాశం పై
ఆత్మీయత
జండాపై భక్తి
నాలుకపై కాదు
గుండెల్లో వుండాలి……..
కులం,మతం,ఏదైనా
ఈ మట్టికి,ఈ జండాకూ
సాగిలపడి మొక్కాలి ……..
నీ వెంతటి వాడైనా!
నీ దెంతటి పాదైనా!
అట్లా మొక్కినపుడే
నువ్వీ గడ్డకు బిడ్డవు……..!
అట్లా సాగిలపడితేనే
అడ్డా నువ్వు ….ఈ… గడ్డకు…..!!
🩷
🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *