జనువాడ రామస్వామి, తెలంగాణకు చెందిన కవి, రచయిత, విశ్రాంత ఆచార్యుడు. రామస్వామి 1952, జనవరి 15న ఆగమయ్య – పార్వతమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలం, చిలుకూరు గ్రామంలో జన్మించాడు.
తెలుగులో ఎం.ఏ, పి.హెచ్.డి చేశారు. జ్యోతిష్య శాస్త్రం, సంస్కృతంలో ఎం.ఏ చేశారు. భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ, మోత్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ తెలుగు ప్రొఫెసర్ గా విధులు నిర్వహించారు. ప్రిన్సిపాల్ గా పదవి విరమణ పొందారు.
రామప్వామికి సత్యవతితో వివాహం జరగింది. వారికి ఒక కుమారుడు (రాఘవేంద్ర).
కవితారామం (కవితా సంకలనం, 1986)
మనోనేత్రం (కవితా సంకలనం, 1996)
శ్రీ చిలుకూరు వెంకటేశ్వర శతకం (2002)
జనువాడ కవితలు (2003)
శ్రీ తిరుమలేశ శతకం (2010)
శ్రీ వేంకటాచల నివాస శతకము (2018)
రాజదండం (పద్యకృతి)
మాధవి కాళ్ల
సేకరణ